అన్వేషించండి

IPL 2024: రెండో సమరానికి బెంగళూరు రెడీ, కోహ్లీ మెరుపులు చూస్తామా?

RCB vs PBKS: తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాజయం పాలైన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది.

Royal Challengers Bengaluru vs Punjab Kings: తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాజయం పాలైన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌(PBKS)తో జరుగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌ను తొలి గెలుపు రుచి చూడాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్న బెంగళూరు.... బౌలింగ్‌లో మాత్రం తేలిపోతుండడం ఆ జట్టును కలవరపెడుతోంది. కానీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండడం బెంగళూరుకు కలిసిరానుంది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింతే పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరుకు విజయం కష్టం కాకపోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు. 

బౌలర్లు పుంజుకుంటారా..?
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన బౌలర్లు ఈ మ్యాచ్‌లో అయినా రాణించాలని బెంగళూరు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్న చెపాక్‌ పిచ్‌పై బెంగళూరు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. మయాంక్ డాగర్, కర్ణ్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్‌... బెంగళూరు స్పిన్‌ భారాన్ని మోయనున్నారు. చెపాక్‌ స్టేడియంలో 27 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు నమోదు అయ్యాయి. ఈ మైదానంలో IPLలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 172 పరుగులు. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్,  యష్ దయాల్ గాడిన పడితే బెంగళూరు కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 9.5, జోసెఫ్ 10.3, దయాల్ 9.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. ఈమ్యాచ్‌లో వీరు గాడిన పడాల్సి ఉంది. 

బ్యాటింగ్‌లోనూ...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  RCB ఆరు వికెట్లకు 173 పరుగులు చేసినా ఇందులోనూ లోపాలు బహిర్గతం అయ్యాయి. ఓ దశలో RCB ఐదు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో దినేష్ కార్తీక్, అనుజ్ రావత్‌ ఆర్సీబీని ఆదుకున్నారు. విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ జోరు అందుకుంటే భారీ స్కోరు ఖాయమే. రజత్ పాటిదార్ నుంచి బెంగళూరు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ స్కోరు ఆశిస్తోంది.  

ఆత్మ విశ్వాసంతో పంజాబ్‌
 తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.  ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ ఇరు జట్లు పోరాడినా చివరికి గెలుపు పంజాబ్‌నే వరించింది. శామ్‌ కరణ్‌ 63 పరుగులతో పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. లివింగ్‌ స్టోన్‌ కూడా చివరి వరకూ క్రీజులో నిలిచి పంజాబ్‌ను గెలిపించాడు. వీరందరూ మరోసారి రాణిస్తే బెంగళూరుపై పంజాబ్‌ విజయం సాధించే అవకాశం ఉంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్రియా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget