అన్వేషించండి

IPL 2024: కొనసాగుతున్న ముంబై కష్టాలు, రాజస్థాన్ ఎదుట మోస్తరు లక్ష్యం

Mumbai Indians Vs Rajasthan Royals: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి రెండు మ్యాచుల్లో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ సేన.. ఏ మాత్రం మెరుగుపడలేదు.

MI vs RR Match Rajasthan Royals restrict Mumbai Indians to 125/9: ఐపీఎల్‌(IPL 2024)లో ముంబై ఇండియన్స్‌(MI) కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి రెండు మ్యాచుల్లో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ సేన.. ఏ మాత్రం మెరుగుపడలేదు. రాజస్థాన్‌(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడమే గగనమైంది. తొలి ఓవర్‌లో మొదలైన ముంబై కష్టాలు చివరి ఓవర్‌ వరకూ కొనసాగాయి. 

 
ఆరంభంలోనే కష్టాలు:
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది. రోహిత్‌ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో సంజు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి హిట్‌ మ్యాన్‌ వెనుదిరిగాడు. దీంతో ఒక్క పరుగుకే ముంబై ఒక వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కూడా ముంబై కష్టాలు కొనసాగాయి. ఆ తర్వాత వెంటనే మరో వికెట్‌ పడిపోయింది. రోహిత్‌ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సమన్‌ థిర్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది. అనంతరం ట్రెంట్‌ బౌల్ట్ మరో వికెట్‌ తీసి ముంబై వెన్ను విరిచాడు. తొలి ఓవర్లో రోహిత్‌ శర్మ, సమన్‌ థీర్‌ను అవుట్‌ చేసిన బౌల్ట్‌... ఇంపాక్ట్‌ ప్లేయర్‌  బ్రెవిస్‌ను అవుట్ చేశాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయిన ముగ్గురు డకౌట్‌ కావడం విశేషం. దీంతో మూడు ఓవర్లకు 16 పరుగులకు  మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఇషాన్‌ కిషన్‌ కూడా అవుటయ్యాడు. 16 పరుగులు చేసిన ఇషాన్‌ను నంద్రి బర్గర్‌ అవుట్‌ చేశాడు. దీంతో 20 పరుగుల వద్ద ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి... పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం తిలక్‌ వర్మ, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. కానీ ఈ దూకుడు ఎంతో సేపు సాగలేదు. 21 బంతుల్లో 34 పరుగులు చేసిన పాండ్యాను చాహల్‌ అవుట్‌ చేశాడు. దీంతో 10 ఓవర్లకు 75 పరుగులకు ముంబై అయిదో వికెట్ కోల్పోయింది. కాసేపటికే మూడు పరుగులు చేసిన పీయూష్‌ చావ్లా అవుటయ్యాడు. ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో పీయూష్‌ చావ్లా అవుటయ్యాడు. తర్వాత 32 పరుగులు చేసిన తిలక్‌ వర్మ కూడా అవుట్‌ కావడంతో ముంబై పనైపోయింది. టిమ్ డేవిడ్‌ 17 పరుగులు... గెరాల్డ్‌ కొయిట్జీ నాలుగు పరుగులు.... చేసి అవుటైపోయారు. దీంతో ముంబై ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 3, యజ్వేంద్ర చాహల్‌ మూడు, బర్గర్‌ రెండు వికెట్లు తీశారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Hyundai Discount: హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Hyundai Discount: హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
హ్యుందాయ్ కార్లపై డిసెంబర్‌లో భారీ తగ్గింపు - జనవరి నుంచి పెంపు!
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - వారికి త్వరలో ఫ్రీగా వాహనాలు, తొలి ప్రాధాన్యం ఎవరికంటే?
Pushpa 2: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
Embed widget