అన్వేషించండి

KKR Vs SRH Preview: కోల్‌కతాతో రైజర్స్ తొలి పోరు - గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. శనివారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుంది.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రం మొద‌లుకానుంది. కోల్‌క‌తా వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద్రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది.7.30 నిమిషాల‌కు ఈ మ్యాచ్‌ మెద‌లుకానుంది. ఐపీయ‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ  రెండు జట్లు చెరో టైటిల్ గెలిచినా గ‌త ఏడాది కాస్త సంతృప్తిక‌ర ఫ‌లితాల‌తో కోల్‌క‌తా ఆత్మ‌విశ్వాసంగానే ఉంది. ఈసారి కొత్త కెప్టెన్‌, భారీ హిట్ట‌ర్లు ఉండ‌డంతో హైదరాబాద్ కూడా  అంతే ధీమాగా ఉంది. అయితే టైటిల్ గెలిచి ఏళ్లు గ‌డ‌వ‌డం,  ప్ర‌తీ ఏడాది క‌ప్ ఆశ‌ల‌తో టోర్నీలోఅడుగుపెట్ట‌డం...కానీ, రిక్త హ‌స్తాల‌తో వెనుదిరిగి రావ‌డం నిరాశే మిగిల్చింది ఈ టీమ్‌ల‌కు. అయితే ప్ర‌స్తుత సీజ‌న్‌లో మ‌రోసారి క‌ప్ ఆశ‌ల‌తో టోర్నీలో అడుగుపెట్టిన వీరి  బ‌లాబ‌లాలు ఏంటి?  వీరిద్ద‌రి మ‌ధ్య రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ టీమ్‌లో టాప్ ఆట‌గాళ్లు ఎవ‌రు లాంటి వివ‌రాలు చూద్దాం..

హైదరా"బాద్‌షా"
స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టు ఈ సారి బ‌లంగా క‌నిపిస్తోంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో బౌలింగ్‌ని న‌మ్ముకొన్న టీం ఏదైనా ఉందంటే అది స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టు. మ‌రోసారి ఈ జ‌ట్టు బౌలింగ్ విభాగం బ‌లీయంగా ఉంది. ఈ సారి వేలంలో 20.50 కోట్లు పెట్టి కొన్న పాట్‌క‌మిన్స్ కెప్టెన్ క‌మ్ ప్ర‌ధాన బౌల‌ర్‌గా ఉండ‌టం హైదరాబాద్ కి లాభించేదే. మ‌రోవైపు భువ‌నేశ్వ‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, ఉనాద్క‌త్‌, మార్కో జ‌న్‌సేన్‌, ఉమ్రాన్‌మాలిక్ ల‌తో పేస్ బౌలింగ్ బ‌లంగా ఉంది. ఇక బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి, అగ‌ర్వాల్‌, మార్‌క్ర‌మ్‌, ట్రావిస్‌హెడ్‌, స‌మ‌ద్,హెన్రిచ్‌క్లాసెన్‌, అభిషేక్ శ‌ర్మ‌, గ్లెన్ ఫిలిప్స్ ఉండ‌డంతో రైజ‌ర్స్ ఈసారి టోర్నీపై భారీ ఆశ‌లు పెట్టుకొంది.

కోల్‌"క‌థేంటి"
ఇక కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌లో మ‌నీష్‌పాండే, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఫిలిప్‌సాల్ట్‌, నితీష్‌రాణా, రూథ‌ర్‌ఫోర్డ్‌, వెంక‌టేశ్‌ అయ్య‌ర్‌,ఫినిష‌ర్ గా రింకూసింగ్ ఉండ‌గా, మ‌రో విధ్వంసం ర‌స్సెల్ కూడా జ‌త క‌లిస్తుండ‌టంతో కొండంత ల‌క్ష్యాలు కూడా చిన్నబోవాల్సిందే. ఇక బౌలింగ్ విష‌యంలో 24.75 కోట్ల‌తో కొనుక్కొన్నమిచెల్ స్టార్క్  ప్ర‌ధాన ఆయుధం.  చ‌మీరా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌లు బౌలింగ్ ద‌ళాన్నిన‌డ‌ప‌నున్నారు. మ‌ధ్య‌లో ర‌సెల్‌, వెంక‌టేశ్‌ లు కొన్ని ఓవ‌ర్లు పంచుకోనున్నారు. వీరితో ప్ర‌త్య‌ర్ధి భ‌ర‌తం ప‌ట్ట‌డానికి కెప్టెన్ శ్రేయ‌స్ వ్యూహాలు ర‌చిస్తాడు.

రికార్డ్ అటువైపే
ఇరుజ‌ట్ల మ‌ధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా కోల్‌క‌తా 16 మ్యాచ్‌లు గెలుపొంద‌గా, స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం 9 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. గ‌త 2023 సీజ‌న్‌లో చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఇక సొంత మైదాన‌మైన‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో రికార్డ్ చూస్తే ఈ మైదానంలో రికార్డ్ కోల‌క‌తాకు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియంలో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు జ‌రిగితే అందులో హైద్రాబాద్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందితే, కోల్‌క‌తా 4 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఇక కోల్‌క‌తా సొంత మైదాన‌మైన ఈడెన్‌గార్డెన్స్‌లో ఇరుజట్లు 9 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డితే 6 మ్యాచ్‌లు కోల్‌క‌తా నెగ్గ‌గా మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలుపొందింది. 

ఇక త‌ట‌స్థ వేదిక‌ల మీద కూడా కోల్‌క‌తా నైట్‌రెడర్స్ జ‌ట్టు ఆధిప‌త్య‌మే చాటుతున్నాయి గ‌ణాంకాలు. ఇక్క‌డ కూడా ఇరు జ‌ట్లు 9 మ్యాచ్‌ల్లో ఢీకొన‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు 6 విజ‌యాలు సాధించింది. మ‌రోవైపు హైద్రాబాద్ 3 విజ‌యాలు సాధించింది. మ‌రో 3 మ్యాచ్‌ల‌ను కోల్పోయింది. ఇలా ఎటుచూసినా గ‌ణాంకాలు హైదరాబాద్‌ని కోల్‌క‌తా స‌మ‌ర్ధ‌వంతంగా నిలువ‌రించింది అనే చెబుతున్నాయి. మ‌రోవైపు అభిమానుల మ‌ద్ద‌తు ఎక్కువ ఉంటుంద‌నుకొనే సొంత‌మైదానంలో కూడా అతిథి కోల్‌క‌తానే గెలుపొందింది అంటే స‌న్‌రైజ‌ర్స్‌ని కోల్‌క‌తా ప‌సికూన చేసేసింది అని అర్ధ‌మ‌వుతోంది.

ఇక ఇరుజ‌ట్ల త‌రుఫున ఆటగాళ్ల రికార్డుల ప‌రంగా చూస్తే డేవిడ్ వార్న‌ర్ 619, నితీష్ రాణా 483, మ‌నీష్‌పాండే 438 ప‌రుగుల‌తో అత్య‌ధిక ప‌రుగువీరులుగా ఉన్నారు. ఇక బౌలింగ్ విష‌యానికొస్తే భువ‌నేశ్వ‌ర్ కుమార్ 24 వికెట్లు, ర‌స్సెల్ 17, ఉమేష్ యాద‌వ్ 12 వికెట్ల‌తో వికెట్ల వీరులుగానిలిచారు. స‌న్‌రైజ‌ర్స్ కి కోల‌క‌తా పై  228 అత్య‌ధిక ప‌రుగులు ఉంటే  కోల్‌క‌తా హైదరాబాద్‌పై త‌క్కువ స్కోరు 101 గా న‌మోదు చేసింది. ఇక 2017లో డేవిడ్ వార్న‌ర్‌, 2023లో హారీబ్రూక్ కోల్‌క‌తాపై సెంచ‌రీలు బాదిన క్రికెట‌ర్లుగా ఉన్నారు.

గ‌ణాంకాలు అన్నీ కోల్‌క‌తాకు అనుకూలంగా ఉండ‌టం, అలాగే సొంత‌మైదానం ఈడెన్‌గార్డెన్ కావ‌డం కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ కి క‌లిసొచ్చే అంశాలు. మ‌రోవైపు క‌ప్పు వేట‌లో ఉన్నాం అని తెలిపేందుకు రైజ‌ర్స్‌కూడా బ‌లంగా ఎదురు నిల‌వ‌నుంది. దీంతో ఈ పోరు ఉత్కంఠ‌కు వేదిక‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget