అన్వేషించండి

IPL 2024: గుజరాత్‌ లక్ష్యం 163 - SRH బౌలర్లు మెరుస్తారా ?

Gujrat Titans vs Sunrisers Hyderabad: గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

Mohit Sharma Helps GT Restrict SRH To 162/8: గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌(SRH) నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో అలరించిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో భారీస్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. మంచి ఆరంభాలే దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా అర్ధ శతకం సాధించలేకపోయాడు. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ కాపాడుకోవాలంటే బౌలర్లు రాణించాల్సి ఉంది.

సరైన ఆరంభం దక్కినా...
 ఒమర్జాయ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు 11 పరుగులు వచ్చాయి.  ట్రావిస్‌ హెడ్ వరుసగా రెండు ఫోర్లు బాది మరోసారి భారీ స్కోరు అందించెలానే కనిపించాడు. సన్‌రైజర్స్‌ స్కోరు 4 ఓవర్లకు 34 పరుగులు చేరిన సమయంలో తొలి వికెట్‌ కోల్పోయింది. 17 బంతుల్లో 16 పరుగులు చేసిన  మయాంక్‌ అగర్వాల్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్‌ అవుట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ శర్మ... వరుసగా రెండు సిక్సర్లు బాది మంచి టచ్‌లో కనిపించాడు. రషీద్‌ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్‌ వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి హైదరాబాద్‌ 56 పరుగులు చేసింది. ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్‌ రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన ఏడో ఓవర్‌లో నాలుగో బంతికి హెడ్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మోహిత్ శర్మ వేసిన 10 ఓవర్‌లో చివరి బంతికి అభిషేక్.. శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.10 ఓవర్లకు స్కోరు హైదరాబాద్‌ స్కోరు 74/3. నూర్ అహ్మద్‌ వేసిన 13 ఓవర్‌లో క్లాసెన్‌ వరుసగా రెండు సిక్స్‌లు బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న హెన్రిచ్‌ క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి రషీద్‌ ఖాన్‌ వేసిన 14 ఓవర్‌లో నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే హైదరాబాద్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఐడెన్ మార్‌క్రమ్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమేశ్ యాదవ్‌ వేసిన 15 ఓవర్‌లో నాలుగో బంతికి రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దర్శన్‌ నల్కండే వేసిన 19 ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ స్కోరు 150 దాటింది. చివరికి హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

సమం చేస్తుందా..?
గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్  మధ్య ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో గుజరాత్ 2, హైదరాబాద్ 1 గెలిచాయి. SRHపై GT అత్యధిక స్కోరు 199 పరుగులు. కాగా గుజరాత్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 195 పరుగులు. ఈ మ్యాచులో ఇరు జట్లు కూడా 50 శాతం గెలిచే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్స్‌కు అనుకూలంగా ఉంటుంది.  ఫాస్ట్ బౌలర్లకు పేస్, బౌన్స్ ఉంటాయన్నారు. స్పిన్నర్లకు కూడా సపోర్ట్ లభిస్తుందని వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Embed widget