అన్వేషించండి

IPL 2024: హైదరాబాద్‌ -మిషన్‌ 300, ఆ సునామీ ఈరోజేనా ?

DC vs SRH: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భయపెడుతోంది. మరోసారి హైదరాబాద్‌ టాపార్డర్‌ సునామీ సృష్టిస్తే ఈసారి 300 పరుగుల మార్క్‌ను చేరుకోవచ్చు. 

Sunrisers next mission 300 ? : ఈ ఐపీఎల్‌(IPL 2024) సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH).. ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. తొలి బంతి నుంచి విధ్వంసంకర బ్యాటింగ్‌తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టి ఔరా అనిపించింది. ముంబైపై మెరుపు దాడి చేసి ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన హైదరాబాద్‌.. తమ బ్యాటింగ్‌ గాలివాటం కాదని బెంగళూరు మ్యాచ్‌తో ప్రత్యర్థి జట్లకు చాటిచెప్పింది. ఇప్పటికే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ బ్యాటర్లు... ఇప్పుడు మిషన్‌ 300 స్టార్ట్‌ చేశారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 300 పరుగుల మార్క్‌ను చేరుకుని ఐపీఎల్‌ 17 ఏళ్ల సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలవాలని హైదరాబాద్‌ బ్యాటర్లు పట్టుదలతో ఉన్నారు. ఓ వైపు ట్రానిస్‌ హెడ్‌ విధ్వంసం... మరోవైపు అభిషేక్‌ శర్మ మెరుపు దాడి, క్లాసెన్‌, మార్క్రమ్‌ ఊచకోత, అబ్దుల్‌ సమద్‌, నితీశ్‌రెడ్డి తుపాను ఇన్నింగ్స్‌లతో హైదరాబాద్‌ జట్టుకు 300 పరుగుల మార్క్‌ సాధ్యమే అనిపిస్తోంది. పటిష్టమైన ముంబై బౌలర్లను ఎదుర్కొని 277 పరుగులు చేసిన హైదరాబాద్‌... బెంగళూరు బౌలింగ్‌నూ ఊచకోత కోసి 287 పరుగులు చేసింది. ముంబై జట్టులో బుమ్రా , బెంగళూరు జట్టులో సిరాజ్‌లాంటి టీమిండియా స్టార్ పేసర్లు ఉన్నా హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసం కొనసాగింది. మరోసారి హైదరాబాద్‌ టాపార్డర్‌... సునామీ సృష్టిస్తే అందులో 300 పరుగుల మార్క్‌ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. 
 
ఆకాశ్‌ కామెంట్స్‌
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాళ జరగనున్న మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఇవాళ్టీ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే 300 పరుగుల రికార్డు బద్దలు కావచ్చన్నాడు. ఢిల్లీ మైదానం చాలా చిన్నది కాబట్టి ఇవాళ్టీ మ్యాచ్‌లోనే 300 పరుగుల మార్క్‌ను హైదరాబాద్‌ బద్దలు కొట్టవచ్చన్నాడు. ఢిల్లీ మైదానం కూడా భారీ షాట్లు ఆడటానికి వీలుగా ఉంటుందని.. ఈ మ్యాచ్‌లో చాలా ఉత్కంఠభరితమైన పోటీని చూడవచ్చని. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ మంచి జోరుతో బరిలోకి దిగడమే ఇందుకు కారణమని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. 
 
కమిన్స్‌ సారథ్యంలో
ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్‌ అందించిన ప్యాట్‌ కమిన్స్‌ కెప్టెన్‌గా రావడంతో సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ ఆటతీరు మారిపోయింది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి.. రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో ఉంది. కమిన్స్‌ హైదరాబాద్‌ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ రాకతో సన్‌రైజర్స్‌ ఓపెనింగ్ చాలా బలంగా మారింది. అభిషేక్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు. క్లాసెన్, మార్క్రమ్‌, సమద్, నితీశ్ రెడ్డితో బ్యాటింగ్ బలంగా మారింది. ఈ బ్యాటింగ్‌ బలంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్​రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. నిలకబడగా ఆడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తోంది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget