అన్వేషించండి

IPL 2024: రఫ్పాడించిన యువ ఆస్ట్రేలియా బ్యాటర్, క్రిస్ మోరిస్ రికార్డు బ్రేక్

Dc Vs Srh : క్రిస్ మోరిస్ ఎనిమిదేళ్ల రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ బద్దలు కొట్టాడు. మొత్తం 18 బంతులు ఆడి ఐదు ఫోర్లు, ఏడు సిక్సులతో కలిపి 65 పరుగులు చేశాడు.

 Third Fastest 50 In Ipl History: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. ముఖ్యంగా క్రిస్ మోరిస్ ఎనిమిదేళ్ల రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(Jake Fraser Mcgurk) బద్దలు కొట్టాడు. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ మొత్తం 18 బంతులు ఆడి 65 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఏడు సిక్సులు ఉన్నాయి.  కేవలం 15 బంతులకే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

ఐపీఎల్ ఎంతో మంది కుర్రాళ్ల ప్రతిభ నిరూపించుకునేందుకు చాలా పెద్ద వేదిక. ఇక్కడ ఆడి తర్వాత జాతీయ జట్లకు సెలెక్ట్ అవటం వాళ్లే తర్వాతి లెజెండ్స్ గా మారటం చాలా మందిని చూశాం. డేవిడ్ వార్నర్ నుంచి నిన్న మొన్నటి మతీషా పతిరానా వరకూ చాలా మంది ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే. అలాంటి కోటాలో చేరేందుకు ఓ 22ఆస్ట్రేలియా యువకుడు  సిద్ధంగా ఉన్నాడు.

 SRH తో ఢిల్లీకి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విసిరిన 267పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో జాక్ ఫ్రేజర్ చూపించిన బ్యాటింగ్ పవర్ ఫుల్ హిట్టింగ్ మైండ్ బ్లోయింగ్ . వాషింగ్టన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ప్రతీ బంతినీ బౌండరీ కి తరలించాడు. ఒక్క ఓవర్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు బాది 30పరుగులు చేశాడు. 15బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి అంతకు ముందే ఇదే మ్యాచ్ లో 16 బంతుల్లో హెడ్ కొట్టిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టి..2024 ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును 15బంతులతో నెలకొల్పాడు. మొత్తంగా 18బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 65పరుగులు చేశాడు.  మెక్ గర్క్ ఉన్నంత సేపు ఢిల్లీ ఏమన్నా అద్భుతం చేస్తోందేమో అన్న ఆశ కలిగింది. . ఇప్పటివరకూ ఢిల్లీ తరపున మూడు మ్యాచులే ఆడిన మెక్ గర్క్ అందులో రెండు హాఫ్ సెంచరీలు బాదటం అతనెంత డేంజరస్ ప్లేయరో చెబుతోంది. ఇప్పటివరకూ మూడు మ్యాచుల్లో 14సిక్సులు కొట్టి ఫ్యూచర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే హోప్స్ తీసుకువచ్చాడు.

బౌండరీలే బౌండరీలు
ట్రానిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ విధ్వంసానికి మాటలే సరిపోలేదు. తొలి ఆరు ఓవర్లలో హైదరాబాద్‌ ఓపెనర్లు 11 సిక్సర్లు.. 13 ఫోర్లు కొట్టారంటే వారి బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరికీ బౌలింగ్‌ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు భయపడిపోయారు. పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ చేసిన 125 పరుగుల్లో 108 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆ తర్వాత అక్షర్‌ పటేల్ ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, మార్క్రమ్‌ను అవుట్ చేసి పరుగులను కట్టడి చేశాడు. చివర్లో  నితీశ్‌కుమార్‌రెడ్డి 27 బంతుల్లో 37 పరుగులు చేసి అవుటయ్యాడు.  షెహబాజ‌్ అహ్మద్‌ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59  అజేయంగా నిలవడంతో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Embed widget