అన్వేషించండి

Shah Rukh Khan: బాద్‌ షా రాక - స్టేడియంలో కేక

KKR vs SRH Qualifier 1: ఐపిఎల్ 2024 ఫైనల్‌ లో చోటు కోసం జరుగుతున్న పొరులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ధైర్యాన్ని పెంచడానికి,  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్  అహమ్మదాబాద్ కు రానున్నాడు. 

Shah Rukh Khan heads to Ahmedabad:  ఐపిఎల్(IPL) 2024 ఫైనల్‌లో చోటు దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఐపీఎల్ 2024 సీజన్ లో తలపడనుంది.  ఇరు జట్లకీ ఇది కీలకమైన మ్యాచ్ కావటంతో  ఆటగాళ్లే కాదు జట్టు యజమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో  క్వాలిఫైయర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో  ధైర్యాన్ని పెంచడానికి,  ఫ్రాంఛైజీ సహ-యజమాని , బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అహమ్మదాబాద్ కు రానున్నాడు.  సోమవారం, ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో ఓటు వేసిన కొన్ని గంటల తర్వాత,  బాలీవుడ్ బాద్షా  తన కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి KKR యొక్క కీలకమైన మ్యాచ్‌కు హాజరయ్యేందుకు అహ్మదాబాద్‌కు ప్రయానమైనట్టు సమాచారం. 
 
కలకత్తా దూకుడు .. 

లీగ్ దశలో కోల్‌కతా జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన  ఈ టీం తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించగా.. మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్ లలో ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించి.. ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.  కోల్‌కత్తా జట్టులో ఓపెనర్లు సాల్ట్, సునీల్ నరైన్ బ్యాట్‌తో అద్భుతాలు చేస్తున్నారు. కొన్ని మ్యాచుల్లో నరైన్ నిలకడగా రాణిస్తుండడం కోల్‌కత్తాకు కలిసి వస్తోంది. ఈ సీజన్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో నరైన్ 461 పరుగులు చేశాడు. సాల్ట్‌ 429 పరుగులు చేశాడు. నరైన్‌ బ్యాట్‌తో ఊచకోత కోస్తున్నాడు. మరోవైపు సాల్ట్‌ ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్‌ చేస్తున్నాడు. నరైన్‌ ఇప్పటికే ఈ ఐపీఎల్‌లో ఓ శతకం కూడా తన పేరిట లిఖించుకున్నాడు.  ఈ సీజన్‌లో సునీల్ నరైన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 461 పరుగులు చేయడంతోపాటు 15 వికెట్లు కూడా నేలకూల్చాడు. ఆల్‌రౌండ్ మెరుపులతో నరైన్‌ కోల్‌కత్తా జట్టులో కీలకంగా మారాడు. ఆండ్రీ రస్సెల్ ఈ సీజన్‌లో 222 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా తీశాడు. వరుణ్ చక్రవర్తి 18 వికెట్లతో మంచి లయలో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ కూడా సంచలనాత్మక ఆరంభాలు అందిస్తున్నాడు. రఘువంశీ, రమణదీప్ సింగ్ కీలక సమయాల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. బ్యాటింగ్‌లో కోల్‌కత్తా మెర్గుగానే ఉన్నా బౌలింగ్‌లో మాత్రం తేలిపోతుంది. నరైన్‌ మినహా మిగిలిన బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలకపోతున్నారు. 

అహమ్మదాబాద్ పిచ్ లో రాణించేది ఎవరో ..

కీలకమైన ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌ స్టేడియంలో  జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో పిచ్‌ ఎలా స్పందిస్తుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఇదే వేదికపైనే జరిగింది.  ఇక్కడే  భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. ఈ పిచ్ మీద ఇప్పటివరకూ రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువ విజయం సాధించాయి. గత ఆరు మ్యాచుల్లో నాలుగుసార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు మాత్రమే విజయవంతంగా లక్ష్యాన్ని కాపాడుకోగలిగాయి. ఈ వేదికపై కేవలం  12సార్లు మాత్రమే 200కుపైగా పరుగులు సాధించాయి. బౌలర్లు ఈ పిచ్‌పై మెరుగ్గా రాణిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget