News
News
వీడియోలు ఆటలు
X

IPL 2023 Stats: ఐపీఎల్ 2023లో బౌలింగ్ రికార్డులు ఇవే - పర్పుల్ క్యాప్ ఎవరి దగ్గర ఉంది?

ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు నమోదైన బౌలింగ్ గణాంకాలు ఇవే.

FOLLOW US: 
Share:

IPL 2023 Bowling Stats: IPL 2023లో లీగ్ దశలో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అత్యధిక వికెట్లు మహ్మద్ సిరాజ్ పేరిట నమోదయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఈ పేస్ గన్ 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ ప్రస్తుతం అతని వద్దే ఉంది. ఇవి కాకుండా మరిన్ని ప్రత్యేక బౌలింగ్ రికార్డులు కూడా చూద్దాం...

1. అత్యధిక మెయిడిన్లు: రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మూడు మెయిడిన్ ఓవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
2. అత్యధిక డాట్ బాల్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ సీజన్‌లో 28 ఓవర్లు వేసి 89 డాట్ బాల్స్ వేశాడు. అంటే అతను వేసిన బంతుల్లో సగానికి పైగా డాట్సే అన్నమాట.
3. ఒక మ్యాచ్‌లో అత్యధిక డాట్ బాల్స్: రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ లక్నో సూపర్ జెయింట్స్‌పై వేసిన 24 బంతుల్లో 18 డాట్ బాల్స్ ఉన్నాయి.
4. బెస్ట్ బౌలింగ్ యావరేజ్: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా ఈ సీజన్‌లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అయితే అతను 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 8.50.
5. బెస్ట్ ఎకానమీ రేట్: ఇక్కడ కూడా నితీష్ రాణానే ముందున్నాడు. 4.25 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు.
6. ఒక మ్యాచ్‌లో బెస్ట్ ఎకానమీ రేట్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 2.75 ఎకానమీ రేటుతో 4 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా తీశాడు.
7. ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
8. బెస్ట్ బౌలింగ్ స్ట్రైక్ రేట్: CSK స్పిన్నర్ మొయిన్ అలీ 60 బంతులు వేసి 7 వికెట్లు పడగొట్టాడు. అంటే అతను వేసిన తొమ్మిది బంతులకు ఒక వికెట్ పడగొట్టాడు. అతని బౌలింగ్ స్ట్రైక్ రేట్ 8.57.
9. ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ స్ట్రైక్ రేట్: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఆండ్రీ రస్సెల్ 13 బంతులు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ స్ట్రైక్ రేట్ 4.33.
10. హ్యాట్రిక్: ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒకే ఒక హ్యాట్రిక్ మాత్రమే నమోదైంది. అది గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు మీద వచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఫీట్ నమోదు చేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్‌ తగిలింది! అత్యంత కీలకమైన వాషింగ్టన్‌ సుందర్ గాయపడ్డాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌ మొత్తానికి దూరమవుతున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజూరీయే ఇందుకు కారణం. ఆరెంజ్‌ ఆర్మీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. జట్టు సభ్యులు అతడికి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ సీజన్లో వాషింగ్టన్‌ సుందర్‌ ఏడు మ్యాచులు ఆడాడు. ఐదు ఇన్నింగ్సుల్లో 60 పరుగులు చేసి మొత్తంగా 3 వికెట్లు పడగొట్టాడు. చివరి మూడు సీజన్ల నుంచి సుందర్‌ గాయాలతో సతమతం అవుతున్నాడు. చేతి వేలికి గాయమవ్వడంతో 2021 సీజన్లో యూఏఈ లెగ్‌ మొత్తానికీ దూరమయ్యాడు. అయితే తొలి దశలో ఆర్సీబీ తరఫున 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతా కథేమీ మారలేదు. కొవిడ్‌ రావడంతో 2022, జనవరిలో టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన మిస్సయ్యాడు. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయంతో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీసూ ఆడలేదు. 

Published at : 27 Apr 2023 03:17 PM (IST) Tags: Trent Boult IPL 2023 Mohd Siraj IPL 2023 Stats

సంబంధిత కథనాలు

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

టాప్ స్టోరీస్

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు -  ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ