News
News
వీడియోలు ఆటలు
X

IPL 2023: బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కూడా రాణిస్తున్న ఐపీఎల్ ఆల్ రౌండ్ కెప్టెన్లు - లిస్టులో ఉన్న నలుగురు ఎవరో తెలుసా?

ఐపీఎల్ 2023లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్లు వీరే.

FOLLOW US: 
Share:

IPL 2023: ఐపీఎల్ 2023లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియబోతున్నాయి. త్వరలోనే ప్లేఆఫ్స్‌పై స్పష్టత రానుంది. లీగ్‌లో ఇప్పటివరకు 56 మ్యాచ్‌లు జరిగాయి. చాలా ఫ్రాంచైజీల కెప్టెన్సీ బ్యాట్స్‌మెన్ చేతిలో ఉంది, కానీ మూడు జట్ల కెప్టెన్లు కూడా బౌలింగ్ చేయడం కనిపిస్తుంది.

వీరిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన నితీష్ రాణా, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్‌కు చెందిన కృనాల్ పాండ్యా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నారు. వీరిలో నితీష్ రాణా పార్ట్ టైమ్ బౌలర్ అయితే, ఇతర ఆటగాళ్లు క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు.

గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో తొమ్మిది ఇన్నింగ్స్‌లో 63.33 సగటు, 8.63 ఎకానమీతో 3 వికెట్లు తీశాడు. అతను ఇప్పటివరకు 22 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 56.00 సగటుతో ఒక వికెట్ సాధించాడు. అతని ఎకానమీ రేటు 8గా ఉంది.

కేఎల్ రాహుల్ గాయం తర్వాత, కృనాల్ పాండ్యాకు లక్నో సూపర్ జెయింట్ కమాండ్ అందించారు. సీనియర్ పాండ్యా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 8 ఇన్నింగ్స్‌ల్లో 26 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 32.33 సగటు, 7.46 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో కృనాల్ పాండ్యా లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇందులో చెన్నైతో జరిగిన మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. అయితే లక్నోపై అతనికి వికెట్ దక్కలేదు. ఐపీఎల్ 16వ సీజన్‌లో కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణా ఇప్పటి వరకు 7.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 24.00 సగటు, 9.19 ఎకానమీతో 3 వికెట్లు తీసుకున్నాడు.

మరో వైపు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో నేడు ముంబయి ఇండియన్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన హార్దిక్‌ పాండ్య వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. వికెట్‌ బాగుందని, డ్యూ కీలకం అవుతుందన్నాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని వెల్లడించాడు.

'మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. వికెట్‌ బాగుంది. డ్యూ ఎఫెక్ట్‌ చూపిస్తుంది. అందుకే టార్గెట్‌ ఛేదించడం సరైన నిర్ణయం. ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైందే. మా ప్రణాళికలకు కట్టుబడి ఉండటం మంచిది. ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. ఇలాంటి సుదీర్ఘ టోర్నమెంట్లలో తప్పులు జరగడం సహజం. దేవుడు మాపై దయ చూపించాడు. ఎవరికీ గాయాల బాధల్లేవ్‌. సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం' అని అని హార్దిక్‌ పాండ్య అన్నాడు.

'మేమూ ఫీల్డింగే ఎంచుకోనేవాళ్లం. ఈ మ్యాచులో మేం బ్యాటింగ్‌, బౌలింగ్‌ సరిగ్గా చేయాలి. కొన్ని మ్యాచులుగా మా ప్రదర్శన బాగుంది. టోర్నీలో ఎక్కడ ఉన్నామో మాకు తెలుసు. ఒకసారి ఒక మ్యాచుపైనే దృష్టి సారిస్తున్నాం. ఇంజూరీ మేనేజ్‌మెంట్‌ పరంగా మేం సరైన నిర్ణయాలే తీసుకుంటున్నాం. గాయపడ్డ ఆటగాళ్లను బట్టి మేం ముందుకెళ్తున్నాం. ఎలాంటి విపరీత పరిస్థితుల ప్రభావాన్ని మాపై పడనీయం. చివరి మ్యాచులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం' అని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

Published at : 12 May 2023 07:24 PM (IST) Tags: Hardik Pandya Krunal Pandya Nitish Rana IPL 2023 Aiden Markram

సంబంధిత కథనాలు

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్‌ గైక్వాడ్‌!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !