Mahesh Babu: ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు ప్రియాంక చోప్రా - బిగ్ మూవీ... ఫస్ట్ టైం అంటూ ఫ్యాన్స్ సందడి
Priyanka Chopra: సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరూ రాజమౌళి మూవీలో కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Mahesh Babu Priyanka Chopra In Single Frame: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని ఇప్పటివరకూ అటు రాజమౌళి, మూవీ టీం అధికారికంగా ధ్రువీకరించలేదు. అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూల్లో వచ్చిన లీక్స్ బట్టి తెలిసింది.
రీసెంట్‌గా మహేష్ బర్త్ డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. ప్రస్తుతం అది ట్రెండ్ అవుతున్న క్రమంలో మహేష్, ప్రియాంక చోప్రా కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నెల 9న మహేష్ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటో ఒకటి లీక్ కాగా మహేష్ ఫ్యాన్స్ దాన్ని షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.
ఫస్ట్ టైం...
ఆ ఫోటోలో మహేష్ బ్లూ కలర్ టీ షర్ట్, గ్రే కలర్ క్యాప్ ధరించగా... ప్రియాంక చోప్రా వైట్ కలర్ దుస్తుల్లో నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఫస్ట్ టైం ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాను కలిసి చూశామంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 'SSMB29' షూటింగ్ సెట్‌లో మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రియాంక చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Superstar @urstrulyMahesh with @priyankachopra 🤍 during birthday celebrations :)#GlobeTrotter #MaheshBabu pic.twitter.com/j2KfSS3OcY
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) August 15, 2025
Also Read: చలో శ్రీలంక అంటున్న రామ్ చరణ్... జాన్వీ కూడా - 'పెద్ది' కోసం ఏం ప్లాన్ చేశారంటే?
వెయిటింగ్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి నవంబరులో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందంటూ హింట్ ఇచ్చారు. ప్రీ లుక్‌తోనే హైప్ క్రియేట్ చేశారు. హీరో మెడలో శివుని త్రిశూలంతో పాటు ఢమరుకం, నంది, రుద్రాక్ష, నామాలతో కూడిన ఓ లాకెట్ చూపించారు. అంతే కాకుండా తాను తీయబోయే మూవీ 'గ్లోబ్ ట్రాటర్' (Globe Trotter) అంటూ స్పష్టం చేశారు. నవంబరులో మూవీ నుంచి మహేష్ లుక్ మాత్రమే కాకుండా ఓ వీడియో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మూవీ స్టోరీ ఒక్క ఫోటోలోనో... ఒక్క ప్రెస్ మీట్‌లోనో వివరించేది కాదని... తాము సృష్టిస్తోన్న విజువల్ వండర్‌ను చూపించేందుకు ఓ అద్భుతాన్ని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ చూడని వండర్‌ను మీ కళ్ల ముందుకు తీసుకువస్తామని చెప్పడంతో హైప్ పదింతలు అవుతోంది. 'గ్లోబ్ ట్రాటర్' అంటే ప్రపంచ పర్యాటకుడు అని అర్థం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణం ఈ మూవీ అని అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... సరికొత్తగా బ్లూ స్క్రీన్ టెక్నాలజీ వాడనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షెడ్యూల్ దక్షిణాఫ్రికాలోని టాంజానియా అడవుల్లో జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తుండగా... మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ స్టార్ ఆర్.మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















