Vishwambhara: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - ఆ రోజున 'విశ్వంభర' నుంచి బిగ్ అప్డేట్
Chiranjeevi Birthday Special: మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర' నుంచి బిగ్ అప్డేట్ రానుంది. ఆ రోజున టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Vishwambhara Teaser On Megastar Birthday: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. టీజర్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా... టీజర్, రిలీజ్ డేట్‌పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
మెగాస్టార్ బర్త్ డే రోజున
ఈ నెల 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా 'విశ్వంభర' నుంచి బిగ్ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ రోజున టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే, టీజర్ రిలీజ్ కావడం మాత్రం కన్ఫర్మ్ అని... రిలీజ్ డేట్‌పై మాత్రం క్లారిటీ లేదనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
చాలా రోజుల గ్యాప్ వచ్చిందని మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదని... మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా బిగ్ అప్డేట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ట్రోలింగ్స్, విమర్శలకు చెక్ పెట్టేలా... టీజర్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు.
Also Read: కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌పై రజనీ దండయాత్ర - ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
స్టోరీ ఏంటంటే?
ఈ మూవీ స్టోరీ ఏంటి అనే దానిపై ఇటీవల ఓ ఇంటర్వ్యలో క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ట మల్లిడి. 14 లోకాల్లోని బ్రహ్మదేవుడు కొలువై ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించామని... ఈ కథకు అదే మూలమని చెప్పారు. అక్కడ ఉండే హీరోయిన్ కోసం హీరో ఏం చేశారనేదే స్టోరీ అంటూ తెలిపారు. ఇప్పటివరకూ వచ్చిన మూవీస్‌లో 14 లోకాలను ఎవరికి తోచిన విధంగా వారు చూపించారని... ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించామని చెప్పారు. 'ఆ లోకంలో హీరోయిన్ ఉండడానికి కారణం ఏంటి? హీరో డైరెక్ట్‌గా ఆ లోకానికి ఎలా వెళ్లాడు? అసలు హీరోయిన్‌ను ఎలా తెచ్చుకున్నాడు?' అనేదే మూవీ స్టోరీ అన్నారు. దైవ లోకాలని రియాలిటీలో చూపించేందుకు భారీగా సెట్స్ వేశామని... ఆడియన్స్‌కు విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.
ఈ మూవీలో చిరు సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తుండగా... సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















