SRH vs MI: ఎవ్వరూ తగ్గదే లే! ముంబయిపై 19 మ్యాచుల్లో సన్‌రైజర్స్ ఎన్ని గెలిచిందంటే!
SRH vs MI: ఉప్పల్ మైదానంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. మరి మంబయిపై ఆరెంజ్ ఆర్మీ ఆధిపత్యం ఎలా ఉంది?
SRH vs MI, IPL 2023:
ఉప్పల్ మైదానంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. చెరో 2 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మరింత ముందుకెళ్తుంది. మరి మంబయిపై ఆరెంజ్ ఆర్మీ ఆధిపత్యం ఎలా ఉంది? రీసెంట్ ఫామ్ ఏంటి? పిచ్ ఎలా ఉండనుంది.
సమవుజ్జీలే!
ఇండియన్ ప్రీమియర్ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ప్రతిసారీ నువ్వా నేనా అన్నట్టే తలపడతాయి. విజయం కోసం ఆఖరి బంతి వరకు శ్రమిస్తాయి. ఉప్పల్‌లో (Uppal Pitch) ఆడిన ప్రతిసారీ లో స్కోరింగ్ గేములు టెన్షన్ పెడుతుంటాయి. లీగ్ చరిత్రలో 19 సార్లు తలపడగా ఈ రెండు జట్లు 9-9తో సమంగా ఉన్నాయి. ఒక మ్యాచు టై అయింది. విజయాల శాతం 50-50గా ఉంది. దక్కన్ ఛార్జర్స్ గణాంకాలను లెక్కిస్తే ఫలితాలు మరోలా ఉంటాయి.
చివరి 5 మ్యాచుల్లో!
రీసెంట్ ఫామ్ ప్రకారం ముంబయి ఇండియన్స్‌దే పైచేయి! ఈ రెండు జట్లు తలపడ్డ చివరి ఐదు మ్యాచుల్లో 3-2తో రోహిత్ సేన అప్పర్ హ్యాండ్ సాధించింది. సన్‌రైజర్స్ 2 విజయాలతో ఉంది. ఈ సారి లెక్క సమం చేసే టైమ్ వచ్చేసింది. 2020లో చెరో మ్యాచ్ గెలిచారు. 2021లో ముంబయి ఏకంగా రెండు మ్యాచులూ గెలిచేసింది. గతేడాది ఒక్క మ్యాచే ఆడాల్సి వచ్చింది. వేర్వేరు గ్రూపుల్లో ఉండటమే ఇందుకు కారణం.
ఉప్పల్ పిచ్ రిపోర్ట్!
ఉప్పల్ వికెట్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. బౌలర్లకే ఎక్కువగా అనుకూలిస్తుంది. సీమర్లు, స్పిన్నర్లు వికెట్లు తీస్తుంటారు. నిలబడితే బ్యాటర్లు దంచికొట్టగలరు. డ్యూ ఫ్యాక్టర్ సైతం తక్కువే ఉంటుంది. అందుకే ఇక్కడ స్వల్ప స్కోర్లనూ డిఫెండ్ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఉప్పల్‌లో 66 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 28, ఛేదన జట్టు 38 గెలిచాయి. టాస్ గెలిచిన వారికన్నా ఓడిన వారికే విజయాల శాతం (66.67) ఎక్కువ. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి 158 రన్స్‌గా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.