By: ABP Desam | Updated at : 05 May 2023 09:19 PM (IST)
గుజరాత్ టైటాన్స్ ( Image Source : IPL 2023 )
RR vs GT, IPL 2023:
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కొలాప్స్ అయింది. సవాయ్ మాన్ సింగ్ వేదికగా జరుగుతున్న మ్యాచులో స్వల్ప స్కోరే చేసింది. 17.5 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌటైంది. చిన్న చిన్న తప్పిదాలు, షాట్ల ఎంపికలో పొరపాట్లు సంజూ సేన కొంప ముంచాయి! అఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్ (3/14), నూర్ అహ్మద్ (2/25) ప్రత్యర్థిని భారీ దెబ్బ కొట్టారు. సంజూ శాంసన్ (30; 20 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్. ట్రెంట్ బౌల్ట్ (15; 11 బంతుల్లో 1x4, 1x6) కాసేపు పోరాడాడు.
.@rashidkhan_19 put on a brilliant show with the ball and he becomes our 🔝 performer from the first innings of the #RRvGT contest in the #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 5, 2023
A look at his bowling summary 🔽 pic.twitter.com/m2GIUVygO4
సంజూ ఉన్నంత వరకే!
సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో సంక్లిష్టమైన పిచ్‌పై ఈ మ్యాచ్ జరిగింది. వికెట్ ఎలా ఉంటుందో తెలియదని మొదటే సంజూ శాంసన్ చెప్పాడు. అతడి మాటలకు తగ్గట్టే పిచ్ భిన్నంగా స్పందించింది. పేసర్లు, స్పిన్నర్లు అదరగొట్టారు. దాంతో రెండో ఓవర్లోనే జోస్ బట్లర్ (8) ఔటయ్యాడు. సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్ రెండో వికెట్‌కు 21 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే అవగాహన లోపంతో ఓ అనవసర పరుగుకు ప్రయత్నించి జైశ్వాల్ ఔటవ్వడంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 50/2తో నిలిచింది.
Great gesture this from @rashidkhan_19 🤗👏🏻#TATAIPL | #RRvGT pic.twitter.com/zWiTjvhqoF
— IndianPremierLeague (@IPL) May 5, 2023
మిడిలార్డర్ కొలాప్స్!
సంజూ శాంసన్ క్రీజులో ఉండటంతో రాజస్థాన్ మంచి స్కోర్ చేసేలా కనిపించింది. జోష్ లిటిల్ వేసిన ఏడో ఓవర్లో ఆఫ్‌సైడ్ షాట్‌కు ప్రయత్నించి అతడు ఔటయ్యాడు. టాప్ ఎడ్జ్ అయిన బంతి గాల్లోకి లేచింది. హార్దిక్ పాండ్య సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత 9 పరుగుల వ్యవధిలోనే రవిచంద్రన్ అశ్విన్ (2), రియాన్ పరాగ్ (2) పెవిలియన్ చేరడంతో రాయల్స్ కష్టాలు పెరిగాయి. షిమ్రన్ హెట్‌మైయిర్ (7), ధ్రువ్ జోరెల్ (9) ఆదుకోలేదు. అప్పటికి స్కోరు 14.1 ఓవర్లకు 96/8. ఈ సిచ్యువేషన్లో ట్రెంట్ బౌల్ట్ కాస్త పోరాడాడు. ఒక సిక్స్, ఒక బౌండరీ బాది స్కోరును 110 దాటించాడు. 16.3వ బంతికి అతడిని మహ్మద్ షమి క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరో భారీ షాట్ ఆడబోయి ఆడమ్ జంపా (7) రనౌట్ అవ్వడంతో రాయల్స్ కథ ముగిసింది.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జోరెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మొహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమి, జోషువా లిటిల్
He gets his second wicket now!
— IndianPremierLeague (@IPL) May 5, 2023
Dhruv Jurel is out LBW and #RR are 7️⃣ down.
Follow the match ▶️ https://t.co/54xkkylevZ#TATAIPL | #RRvGT https://t.co/ZU7KRji9nA
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!