IPL 2023 Retained Players: బిగ్ మ్యాన్ పొలార్డ్‌ను వదిలేసిన ముంబయి! సీఎస్కేలో నలుగురికి షాక్!
IPL 2023 Retained Players: ఐపీఎల్ 2023 సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు రీటెన్షన్ జాబితాలను ఇప్పటికే బీసీసీఐకి సమర్పించాయని సమాచారం.
IPL 2023 Retained Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాతి సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. అన్ని ఫ్రాంచైజీలు తాము వదిలేయాల్సిన, అట్టిపెట్టుకోవాల్సిన ఆటగాళ్ల జాబితాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు రీటెన్షన్ జాబితాలను ఇప్పటికే బీసీసీఐకి సమర్పించాయని తెలిసింది. వీటిని సబ్మింట్ చేసేందుకు నవంబర్ 15 చివరి తేదీ.
ఐపీఎల్ చరిత్రలోనే ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ అత్యుత్తమ జట్లు! ముంబయి ఐదు, చెన్నై నాలుగుసార్లు విజేతలుగా ఆవిర్భవించాయి. ఇప్పటి వరకు 15 సీజన్లు జరిగితే అందులో 9 సార్లు వీరిద్దరే ట్రోఫీలు పంచుకున్నారు. అలాంటిది చివరి సీజన్లో వీరు అత్యంత ఘోరంగా ఓటమి పాలయ్యారు. సరైన పేసర్లు లేక సమతూకం దొరక్క ఇబ్బంది పడ్డారు. కొందరి ప్రదర్శన బాగాలేకున్నా తప్పక ఆడించాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. దాంతో ఈ సారి ముందుగానే క్రికెటర్ల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నారు.
View this post on Instagram
ప్రీమియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్‌కింగ్స్ వదిలేసుకుంటుందని అంతా భావించారు. గతేడాది మీడియాలో వీరి విభేదాలపై వార్తలు రావడమే ఇందుకు కారణం. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని మహీ చెప్పాడని తెలిసింది. మొత్తంగా సీఎస్‌కే 9 మందిని రీటెయిన్ చేసుకోగా నలుగురిని విడుదల చేసింది. ధోనీ, జడ్డూ, మొయిన్ అలీ, శివమ్ దూబె, రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, ముకేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్‌ను అట్టిపెట్టుకుంది. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీశన్, మిచెల్ శాంట్నర్‌ను వదిలేసిందని తెలిసింది.
గతేడాది ముంబయి ఇండియన్స్ ప్రదర్శన గురించి ఎంత ఘోరంగా ఉందో తెలిసిందే. పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఈసారి ముంబయి 10 మందిని అట్టిపెట్టుకోగా ఐదుగురిని వదిలేసింది. రోహిత్ శర్మ, డీవాల్డ్ బ్రూవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియెల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, త్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మను రీటెయిన్ చేసుకుంది. ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, తైమల్ మిల్స్, మయాంక్ మర్కండే, హృతిక్ షోకీన్‌ను వదిలేసిందని సమాచారం.
View this post on Instagram