By: ABP Desam | Updated at : 10 Apr 2023 12:29 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఆర్సీబీ vs లక్నో ( Image Source : Twitter, LSG, RCB )
RCB vs LSG, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో మ్యాచులు ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. మూడేళ్ల తర్వాత జట్లన్నీ హోమ్‌గ్రౌండ్‌లో అభిమానులను మురిపిస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే పిచ్‌లు ఇప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. వాటి స్వభావమేంటో అంత ఈజీగా అర్థమవ్వడం లేదు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ చిన్నస్వామి మైదానంలో తలపడుతున్నాయి. నేటి పిచ్ ఎలా ఉండబోతోంది? రెండు జట్లలో ఎవరిది ఆధిపత్యం?
Game Day RCB v LSG: Preview
— Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2023
Captain Faf, Coach Sanjay and Spin Wizard Karn talk about tonight’s opponents and how the team plans to turn things around, on @hombalefilms brings to you Game Day.#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvLSG pic.twitter.com/Bvr0GwqmTs
పిచ్ రిపోర్ట్
చిన్నస్వామి.. అంటే అందరికీ గుర్తొచ్చేది హై స్కోరింగ్ పిచ్! కొన్నేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు, వందల కొద్దీ సిక్సర్లకు ఇది కంచుకోట! బౌలర్లకు సింహస్వప్నం. బ్యాటర్లకు స్వర్గధామం. సాధారణంగా బెంగళూరు స్టేడియం చాలా చిన్నది. బౌండరీ సరిహద్దులూ ఎక్కువ దూరం ఉండవు. అందుకే బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు బాదేస్తారు. సెంచరీలు కొట్టేస్తారు. 2018 నుంచి ఇక్కడ ఐపీఎల్ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 183. ఇదే సమయంలో ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఎఫెక్టివ్‌గా ఉంటున్నట్టు స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. పేసర్లు 9.8 ఎకానమీతో పరుగులు ఇస్తుండగా స్పిన్నర్లు 8.1తో కట్టడి చేస్తున్నారు. చివరి ఐదు సీజన్లలో సగటున మ్యాచుకు 18 సిక్సర్లు నమోదు అవుతున్నాయి.
ఆర్సీబీ పైచేయి!
లక్నో సూపర్ జెయింట్స్ గతేడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇప్పటి వరకు రెండు సార్లు తలపడింది. రెండు సార్లూ ఓడింది. ఆర్సీబీ ఈ రెండు మ్యాచుల్లోనూ స్కోర్లను డిఫెండ్ చేసుకొంది. 2022, ఏప్రిల్ 19న డీవై పాటిల్‌లో జరిగిన మ్యాచులో ఆర్సీబీ మొదట 181/6 పరుగులు చేసింది. బదులుగా లక్నో 163/8కి పరిమితం అయింది. డుప్లెసిస్ 96 (64 బంతుల్లో) వీర బాదుడు బాదేశాడు. ఛేదనలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీసి రాహుల్ సేనను ఓడించాడు.
Memories galore with our former players, now in LSG! 🔥
— Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2023
Let's have a great one tonight, boys! 🤝#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvLSG pic.twitter.com/BlKtpDDR9Y
ఎలిమినేటర్లో ఢీలా!
2022, మే 25న ఆర్సీబీ, లక్నో ఈడెన్ గార్డెన్స్‌లో ఎలిమినేటర్లో తలపడ్డాయి. తొలుత ఆర్సీబీ 207/4తో అదరగొట్టింది. రజత్ పాటిదార్ (112; 54 బంతుల్లో) సెంచరీ కొట్టేశాడు. ఛేదనలో రాహుల్ (79), దీపక్ హుడా (45) పోరాడినా లక్నో 193/6కు పరిమితమైంది. మళ్లీ అదే హేజిల్‌వుడ్ 3 వికెట్లతో రాహుల్ సేన నడ్డి విరిచాడు. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి!!
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!