![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RCB vs LSG, 1 Innings Highlight: చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం - లక్నోపై చెలరేగిన కోహ్లీ సేన!
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
![RCB vs LSG, 1 Innings Highlight: చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం - లక్నోపై చెలరేగిన కోహ్లీ సేన! IPL 2023: RCB given target of 213 runs against LSG in Match 15 at M Chinnaswamy Stadium RCB vs LSG, 1 Innings Highlight: చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం - లక్నోపై చెలరేగిన కోహ్లీ సేన!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/5d339dce285ff8fda0ece8b06d835e231681142721408252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2023, RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బ్యాటర్ల విధ్వంసం సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ (79 నాటౌట్: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (61: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ (61: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (79 నాటౌట్: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) పూర్తి సాధికారికతతో ఆడారు. లక్నో బౌలర్లకు అస్సలు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. కోహ్లీ అర్థ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనంతరం విరాట్‌ను అమిత్ మిశ్రా అవుట్ చేశాడు.
విరాట్ స్థానంలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (59: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. మెల్లగా డుఫ్లెసిస్ కూడా గేర్లు మార్చాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తను కొట్టిన బంతి స్టేడియం బయట పడటం విశేషం. 118 మీటర్ల భారీ సిక్సర్ అది. రెండో వికెట్‌కు 115 పరుగులు జోడించిన అనంతరం చివరి ఓవర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను మార్క్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి బెంగళూరు 212 పరుగులు చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 10, 2023
The first innings was filled with boundaries courtesy of the Faf-Virat-Maxi trio 😉😉@RCBTweets post a mammoth total of 212-2 on board. Can @LucknowIPL chase this challenging target down?
Scorecard ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/JPJxiOotM2
Skipper @faf1307 led from the front with an exquisite unbeaten 79-run knock and he becomes our 🔝 performer from the first innings of the #RCBvLSG clash in the #TATAIPL 👌👌
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A look at his batting summary 🔽 pic.twitter.com/BCwPejpx6w
6️⃣1️⃣ runs
— IndianPremierLeague (@IPL) April 10, 2023
4️⃣4️⃣ balls
4️⃣ fours
4️⃣ sixes@imVkohli set the foundation of the innings with a stroke-filled aggressive knock 👌👌
Relive his FIFTY here 🎥🔽 #TATAIPL | #RCBvLSG https://t.co/zmaqkn7ZBf pic.twitter.com/yUGde4Qi62
It's raining SIXES when the BIG SHOW is at the crease! 🤩
— IndianPremierLeague (@IPL) April 10, 2023
He brings up a terrific half-century 😎
100 partnership also up for the second wicket 🙌
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG | @Gmaxi_32 pic.twitter.com/2VG7LMrRG1
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)