PBKS vs LSG: పంజాబ్ vs లక్నో.. గెలిస్తే 10 పాయింట్లు! మొహాలిలో రాహుల్ చితక్కొడతాడా?
PBKS vs LSG: ఐపీఎల్ 2023లో శుక్రవారం 38వ మ్యాచ్ జరుగుతోంది. మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG) తలపడుతున్నాయి.
PBKS vs LSG, IPL 2023:
ఐపీఎల్ 2023లో శుక్రవారం 38వ మ్యాచ్ జరుగుతోంది. మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG) తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకు ఇది రెండో పోరు! ఇందులో గెలిచిన వాళ్లు పది పాయింట్లతో పట్టికలో మరింత ముందుకెళ్తారు!
గబ్బర్.. ఫిట్!!
గతంతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మంచి పోరాట పటిమ కనబరుస్తోంది. ఆఖరి వరకు విజయం కోసం పట్టుదలగా ఆడుతోంది. మూమెంటమ్‌ను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikar Dhaawan) గాయంతో డగౌట్లో కూర్చుంటున్నా.. సామ్ కరన్ (Sam Curran) అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఓపెనింగ్ పరంగా ఇప్పటికీ ఇబ్బందులున్నాయి. లియామ్ లివింగ్ స్టోన్ రావడంతో బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. మాథ్యూ షార్ట్ అటాకింగ్ మోడ్‌లో ఉంటున్నాడు. జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ ఫర్వాలేదు. యువ పేసర్ అర్షదీప్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ముంబయి ఇండియన్స్ మ్యాచులో బ్యాటర్లను వణికించాడు. అతడి బంతులకు వికెట్లే విరిగిపోయాయి. కరన్, నేథన్ ఇల్లిస్ పేస్ ఫర్వాలేదు. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ స్పిన్‌తో ఆకట్టుకుంటున్నారు. కాంబినేషన్ సెట్ కాకపోవడంతో రబాడకు చోటు దొరకడం లేదు.
రాహుల్.. మారాలి!
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) గెలుపు అవకాశాలను చేజేతులా వదులుకుంటోంది. మ్యాచ్ మొత్తం పట్టుబిగించి కొద్దిలో సడలిస్తోంది. ప్రత్యర్థులకు అవకాశం ఇస్తోంది. దీన్నుంచి వేగంగా బయటపడాలి. ఇక ఛేదనలో మరింత దూకుడుగా ఉండాలి. భీకరమైన బ్యాటింగ్ లైనప్ పెట్టుకొని టార్గెట్లను ఛేజ్ చేసేందుకు ఇబ్బంది పడుతోంది. కేఎల్ రాహుల్ (KL Rahul) ఫామ్‌లోకి వచ్చాడు. స్లో పిచ్‌లపై అదరగొడుతున్నాడు. అయితే మిగతా వికెట్లపై అటాకింగ్ మోడ్ అవసరం. కైల్ మేయర్స్ ప్లేస్‌లో డికాక్‌కు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. స్టాయినిస్, పూరన్ ఎప్పటికీ డేంజరే. లక్నో బౌలింగ్ మాత్రం అద్భుతం! మార్క్‌వుడ్‌కు రెస్ట్ ఇచ్చినా.. నవీనుల్ హఖ్ అదరగొడుతున్నాడు. యుధ్‌వీర్ బాగున్నాడు. అవేశ్ ఖాన్ గురించి తెలిసిందే. స్టాయినిస్ మీడియం పేస్‌తో వికెట్లు తీస్తున్నాడు. బిష్ణోయ్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమిత్ మిశ్రా లేటు వయసులోనూ సత్తా చాటుతున్నాడు.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కేవరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.