By: ABP Desam | Updated at : 13 Apr 2023 10:08 PM (IST)
వికెట్ తీసిన ఆనందంలో రషీద్ ఖాన్ (Image Credits: IPL Twitter)
IPL 2023, GT vs PBKS: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తడబడింది. ఈ మ్యాచ్‌తో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 153 పరుగులు మాత్రమే చేసింది. మాథ్యూ షార్ట్ (36: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్ మోహిత్ శర్మ కేవలం 18 మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 154 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో గుజరాట్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కానీ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0: 2 బంతుల్లో), శిఖర్ ధావన్ (8: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) ఇద్దరూ ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో పంజాబ్ కింగ్స్ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
కానీ మాథ్యూ షార్ట్ (36: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), భానుక రాజపక్స (20: 26 బంతుల్లో, ఒక ఫోర్) పంజాబ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. అయితే భానుక రాజపక్స మరీ నిదానంగా ఆడాడు. దీంతో స్కోరింగ్ రేటు బాగా పడిపోయింది. వీరు మూడో వికెట్‌కు 27 పరుగులు జోడించారు.
ఆ తర్వాత జితేష్ శర్మ (25: 23 బంతుల్లో, ఐదు ఫోర్లు), శామ్ కరన్ (22: 22 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా బ్యాట్ ఝళిపించలేకపోయారు. కానీ చివర్లో షారుక్ ఖాన్ (22: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కొంచెం వేగంగా ఆడటంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
సికందర్ రజా, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, రాహుల్ చాహర్, అథర్వ తైదే, గుర్నూర్ బ్రార్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
విజయ్ శంకర్, శివమ్ మావి, జయంత్ యాదవ్, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్
T. I. M. B. E. R!@rashidkhan_19 strikes in his first over 👌 👌#PBKS lose Matthew Short.
— IndianPremierLeague (@IPL) April 13, 2023
Follow the match ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT | @gujarat_titans pic.twitter.com/sNKeJ4T96z
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 13, 2023
Vital contributions from the middle order powered @PunjabKingsIPL to 153/8 💪@gujarat_titans put up a solid show with the ball 👌👌
The #GT chase to begin soon!
Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/aAF3E8T6Tt
He kept things tight with the ball & scalped 2⃣ wickets and for his impressive show with the ball, Mohit Sharma is the top performer from the first innings of the #PBKSvGT clash 👍 👍 #TATAIPL | @gujarat_titans
— IndianPremierLeague (@IPL) April 13, 2023
Here's his bowling summary 🔽 pic.twitter.com/w4RJlPDu2t
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్ గైక్వాడ్!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !