అన్వేషించండి

MI vs KKR, Highlights: కేకేఆర్‌ను కుమ్మేసిన ముంబయి! వెంకీ అయ్యర్ 100 వేస్ట్‌!

MI vs KKR, Highlights: ఐపీఎల్‌ 2023లో ముంబయి ఇండియన్స్‌ వరుసగా రెండో విజయం అందుకుంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది.

MI vs KKR, Highlights: 

ఐపీఎల్‌ 2023లో ముంబయి ఇండియన్స్‌ వరుసగా రెండో విజయం అందుకుంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను అత్యంత సునాయాసంగా ఛేదించేసింది. 17.4 ఓవర్లకే 5 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (58; 25 బంతుల్లో 5x4, 5x6) మెరుపు హాఫ్‌ సెంచరీ బాదేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (43; 25 బంతుల్లో 4x4, 3x6) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అంతకు ముందు కేకేఆర్‌లో వెంకటేశ్ అయ్యర్‌ (104; 51 బంతుల్లో 6x4, 9x6) అమేజింగ్‌ సెంచరీ కొట్టేశాడు. మెక్‌కలమ్‌ తర్వాత కేకేఆర్‌లో సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (21;11 బంతుల్లో 3x4, 1x6) మెరిశాడు.

ఇదో టార్గెట్టా!!

'మేం కొడితే వాళ్లూ వీళ్లూ చెప్పుకోవడమే కానీ మాకూ తెలియదు' అన్నట్టుగా ఆడింది... ముంబయి ఇండియన్స్‌! 186 పరుగుల లక్ష్యం తమకో లెక్కే కాదన్నట్టుగా చెలరేగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20; 13 బంతుల్లో) ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చాడు. రెండు సిక్సర్లు బాదేశాడు. మరోవైపు చిచ్చర పిడుగు ఇషాన్‌ కిషన్‌ డైనమైట్‌లా పేలాడు. డేంజరస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ను ఊచకోత కోశాడు. వరుస సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికే ముంబయి 72/1తో నిలిచింది. జట్టు స్కోరు 65 వద్ద రోహిత్‌ను సుయాశ్‌, 83 వద్ద ఇషాన్‌ను వరుణ్‌ బౌల్డ్‌ చేశాడు.

సూర్య భాయ్‌ వచ్చేశాడు!

ఓపెనర్లు ఔటయ్యాక తిలక్‌ వర్మ (30; 25 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి సూర్యకుమార్‌ దుమ్మురేపాడు. మూడో వికెట్‌కు 38 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 360 డిగ్రీల బాదుడును ప్రదర్శించాడు. 13.5వ బంతికి తిలక్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ జోడీని సుయాశ్‌ విడగొట్టాడు. కానీ అప్పటికే చేయాల్సిన రన్‌రేట్‌ తగ్గిపోయింది. విజయానికి 9 పరుగులు అవసరమైనప్పుడు శార్దూల్ వేసిన 16.3వ బంతికి సూర్య పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (24; 13 బంతుల్లో 2x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

అమేజింగ్‌.. వెంకీ అయ్యర్‌!

మధ్యాహ్నం మ్యాచ్‌.. డ్రై పిచ్‌.. గ్రిప్‌ అవుతున్న బంతి! పరిస్థితులు బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేవు. కామెరాన్‌ గ్రీన్‌ వేసిన .15వ బంతికే ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ (0) ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ రెహ్మనుల్లా గుర్బాజ్‌ (8) మరోసారి విఫలమయ్యాడు. అయినప్పటికీ పవర్‌ ప్లే ముగిసే సరికి కేకేఆర్‌ 52/2తో నిలిచిందంటే వెంకటేశ్ అయ్యర్‌ చలవే! ఆరంభంలోనే మోకాలికి బంతి తగిలి విలవిల్లాడిని అతడు.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పరుగెత్తడం కష్టం కావడంతో సిక్సర్లు, బౌండరీలు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. జస్ట్‌ 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. రెండో వికెట్‌కు గుర్బాజ్‌తో కలిసి 22 బంతుల్లోనే 46 రన్స్‌ భాగస్వామ్యం అందించాడు. నితీశ్ రాణా (5) త్వరగానే డగౌట్‌కు చేరుకున్నాడు.

శతకం బాదిన వెంకీ!

ఈ సిచ్యువేషన్లో శార్దూల్‌ ఠాకూర్‌ (13)తో కలిసి వెంకటేశ్ ఇన్నింగ్స్‌ నడిపించాడు. అతడితో కలిసి నాలుగో వికెట్‌కు 28 బంతుల్లోనే 50 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 123 వద్ద శార్దూల్‌ను షోకీన్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌ (18) నిలకడగా ఆడాడు. వెంకీకి అండగా నిలిచాడు. దాంతో 16.3 ఓవర్లకే కేకేఆర్‌ స్కోరు 150కి చేరుకుంది. స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తర్వాత 90 వద్ద ఉన్న వెంకీ కాస్త స్లోగా ఆడాడు. పియూష్‌, షోకీన్‌ బౌలింగ్‌లో రిస్క్‌ తీసుకోలేదు. సింగిల్స్‌, డబుల్స్‌ తీసి 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మెక్‌కలమ్ తర్వాత కేకేఆర్‌కు సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 17.2వ బంతిని రివర్స్‌ స్కూప్‌తో బౌండరీకి పంపించాలని వెంకీ ప్రయత్నించాడు. మిస్‌టైమ్‌ కావడంతో గాల్లోకి లేచిన బంతిని జన్‌సెన్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్‌ కొన్ని షాట్లు ఆడి స్కోరును 185/6కి చేర్చాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Embed widget