IPL 2023, MI vs GT: ఇంపార్టెంట్ మ్యాచులో టాస్ ఓడిన రోహిత్!
IPL 2023, MI vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ వేశారు.
![IPL 2023, MI vs GT: ఇంపార్టెంట్ మ్యాచులో టాస్ ఓడిన రోహిత్! IPL 2023 MI vs GT Gujarat Titans have won the toss and have opted to field IPL 2023, MI vs GT: ఇంపార్టెంట్ మ్యాచులో టాస్ ఓడిన రోహిత్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/3f973222543758679071e20ded3c079f1683898783700251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2023, MI vs GT:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ బాగుందని, డ్యూ కీలకం అవుతుందన్నాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని వెల్లడించాడు.
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగుంది. డ్యూ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే టార్గెట్ ఛేదించడం సరైన నిర్ణయం. ప్రతి మ్యాచ్ ముఖ్యమైందే. మా ప్రణాళికలకు కట్టుబడి ఉండటం మంచిది. ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. ఇలాంటి సుదీర్ఘ టోర్నమెంట్లలో తప్పులు జరగడం సహజం. దేవుడు మాపై దయ చూపించాడు. ఎవరికీ గాయాల బాధల్లేవ్. సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం' అని అని హార్దిక్ పాండ్య అన్నాడు.
'మేమూ ఫీల్డింగే ఎంచుకోనేవాళ్లం. ఈ మ్యాచులో మేం బ్యాటింగ్, బౌలింగ్ సరిగ్గా చేయాలి. కొన్ని మ్యాచులుగా మా ప్రదర్శన బాగుంది. టోర్నీలో ఎక్కడ ఉన్నామో మాకు తెలుసు. ఒకసారి ఒక మ్యాచుపైనే దృష్టి సారిస్తున్నాం. ఇంజూరీ మేనేజ్‌మెంట్ పరంగా మేం సరైన నిర్ణయాలే తీసుకుంటున్నాం. గాయపడ్డ ఆటగాళ్లను బట్టి మేం ముందుకెళ్తున్నాం. ఎలాంటి విపరీత పరిస్థితుల ప్రభావాన్ని మాపై పడనీయం. చివరి మ్యాచులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం' అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
Playing 1️⃣1️⃣s for tonight’s game are here 💪
— IndianPremierLeague (@IPL) May 12, 2023
Who is winning this folks? 🤔
Follow the Match: https://t.co/o61rmJWtC5#TATAIPL | #MIvGT pic.twitter.com/6pMSOnlIPD
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహల్ వధేర, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జేసన్ బెహ్రన్‌డార్ఫ్
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఎలాగైనా ప్లేఆఫ్ చేరుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌లో లేనప్పటికీ తనదైన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. ఆటగాళ్లంతా జోష్‌లో ఉండటం కాన్ఫిడెన్స్ పెంచింది. ఇషాన్ కిషన్ అమేజింగ్ ఓపెనింగ్ పాట్నర్‌షిప్స్ అందిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై పవర్‌ప్లేలో ఎదురుదాడికి దిగుతున్నాడు. వాంఖడేలో 200+ స్కోర్లను ముంబయి మిడిలార్డర్ ఈజీగా ఛేజ్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar) మళ్లీ తన మునుపటి ఫామ్ అందుకున్నాడు. నేహాల్ వధేరా మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. ఈ పోరుకు హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అందుబాటులో ఉన్నాడు. టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ సైతం విలువైన ఇన్నింగ్సులే ఆడుతున్నారు. బౌలింగ్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ నమ్ముకోవడానికి లేదు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో పియూష్ చావ్లా, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ బాగున్నారు. కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో అంత పస కనిపించడం లేదు. ఆర్చర్ లేకపోవడం లోటే. బెరెన్ డార్ఫ్ ఫర్వాలేదు.
🚨 Toss Updates 🚨@gujarat_titans win the toss and elect to field first against @mipaltan
— IndianPremierLeague (@IPL) May 12, 2023
Follow the Match: https://t.co/o61rmJWtC5#TATAIPL | #MIvGT pic.twitter.com/rLNl8FlRhG
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)