LSG vs SRH, IPl 2023: సఫారీస్ ఎంట్రీతో స్ట్రాటజీల్లో మార్పు! లక్నోపై ఆరెంజ్ ఆర్మీ ఇంప్టాక్ ప్లేయర్ వ్యూహం ఇదేనా!
LSG vs SRH, IPL 2023: శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ తలపడుతున్నాయి. మరి ఈ మ్యాచులో తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంపాక్ట్ ప్లేయర్లు ఎవరంటే?
![LSG vs SRH, IPl 2023: సఫారీస్ ఎంట్రీతో స్ట్రాటజీల్లో మార్పు! లక్నోపై ఆరెంజ్ ఆర్మీ ఇంప్టాక్ ప్లేయర్ వ్యూహం ఇదేనా! IPl 2023 LSG vs SRH Sunrisers Hyderabad Lucknow supergiants impact player strategy match 10 LSG vs SRH, IPl 2023: సఫారీస్ ఎంట్రీతో స్ట్రాటజీల్లో మార్పు! లక్నోపై ఆరెంజ్ ఆర్మీ ఇంప్టాక్ ప్లేయర్ వ్యూహం ఇదేనా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/07/8d36cfa8d63e4df9e2d942ff8783093d1680863835004251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
LSG vs SRH, IPl 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Supergiants) తలపడుతోంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మరోవైపు లక్నో సొంత గ్రౌండ్‌లో రెండో గెలుపు కోసం పట్టుదలగా ఉంది. మరి ఈ మ్యాచులో తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంపాక్ట్ ప్లేయర్లు ఎవరంటే?
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్ట్రాటజీ
తొలుత బ్యాటింగ్ చేస్తే: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
తొలుత బౌలింగ్ చేస్తే: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంప్టాక్ ప్లేయర్ స్ట్రాటజీ సింపుల్‌గానే ఉంది. సఫారీ ఆటగాళ్లు అయిడెన్ మార్‌క్రమ్, మార్కో జన్‌సెన్, హెన్రిచ్ క్లాసెన్ జట్టులో చేరారు. వీరిలో క్లాసెన్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ స్థానాన్ని అతడు తీసుకుంటాడు. జన్‌సెన్ మరికొన్ని మ్యాచులు ఆగాల్సి ఉంటుంది. అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగీ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉంటారు. తొలుత బ్యాటింగ్ చేస్తే అబ్దుల్ సమద్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది. బౌలింగ్ చేస్తే త్యాగీ వస్తాడు.
లక్నో సూపర్ జెయింట్స్ స్ట్రాటజీ
తొలుత బ్యాటింగ్ చేస్తే: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్క్‌వుడ్
తొలుత బౌలింగ్ చేస్తే: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కత్ / యశ్ ఠాకూర్, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మార్క్‌వుడ్
క్వింటన్ డికాక్ రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో కొన్ని మార్పులు తప్పవు! ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ రిజర్వు బెంచ్‌పై ఉండాల్సి వస్తోంది. విండీస్ వీరుడు కైల్ మేయర్ విధ్వంసకర ఫామ్‌లో ఉండటమే ఇందుకు కారణం. తొలుత బ్యాటింగ్ చేస్తే బదోనీ నేరుగా జట్టులో ఉంటాడు. బౌలింగ్ చేస్తే జయదేవ్ ఉనద్కత్ లేదా యశ్ ఠాకూర్‌లో ఒకరిని తీసుకుంటారు. ఆ తర్వాత బదోనీని ఇంప్టాక్ ప్లేయర్‌గా ఆడిస్తారు.
పిచ్ ఎలా ఉందంటే?
తొలి మ్యాచులో లక్నో ఏకనా పిచ ప్రవర్తన అర్థమవ్వలేదు. పేస్ బౌలర్లు, స్పిన్నర్లకు అనుకూలించింది. రాగానే బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. అయితే నిలబడితే సిక్సర్లు, బౌండరీలు కొట్టగలరు. అటు పేస్, ఇటు స్పిన్‌ను ఉపయోగపడుతుంది. బౌండరీలూ పెద్దవే. రెండు జట్లకూ సమాన అవకాశాలే ఉంటాయి. ఈ పిచ్‌పై లోకల్ బాయ్ భువీకి అనుభవం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)