IPL 2023, PBKS vs LSG: లక్నో మజిల్ మెన్ 'హల్క్' ఇన్నింగ్స్ - పంజాబ్ టార్గెట్ 258
IPL 2023, PBKS vs LSG: 'సూపర్ జెయింట్స్' పవర్ ఏంటో చూపించింది లక్నో! పంజాబ్ కింగ్స్‌పై 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి ఏకంగా 257 పరుగులు చేసింది.
IPL 2023, PBKS vs LSG:
'సూపర్ జెయింట్స్' పవర్ ఏంటో చూపించింది లక్నో! జెయింట్ అనే పదానికి నిజమైన అర్థం చెప్పింది! ఇండియన్ ప్రీమియర్ లీగులో రెండో హయ్యెస్ట్ స్కోర్ సాధించింది. ఆర్సీబీ 263 టాప్ స్కోర్‌కు దాదాపుగా ఎసరు పెట్టింది! జస్ట్ 6 పరుగుల దూరంతో ఆగిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి ఏకంగా 257 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (54; 24 బంతుల్లో 7x4, 4x6), మార్కస్ స్టాయినిస్ (72; 40 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. ఆయుష్ బదోనీ (43; 24 బంతుల్లో 3x4, 3x6), నికోలస్ పూరన్ (45; 24 బంతుల్లో 7x4, 1x6) దంచికొట్టారు. ఈ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలర్లు మెంటల్‌గా స్ట్రక్ అయ్యారు. కాన్ఫిడెన్స్ కోల్పోయి... ఇన్నింగ్స్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేశారు!
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 28, 2023
72 from Stoinis
54 from Mayers
45 from Pooran
43 from Badoni@LucknowIPL put up a mammoth total of 257/5 on the board.
Scorecard - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/gA9r66lddP
దంచుడే.. దంచుడు!
మొహాలిలో డ్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి బంతి నుంచే అటాక్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) త్వరగానే ఔటైనా మిగతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవర్ ప్లే ముగిసే సరికే లక్నోను 74/2తో నిలిపారు. రాహుల్, మేయర్స్ తొలి వికెట్‌కు 21 బంతుల్లోనే 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 41 వద్ద కేఎల్‌ను రబాడ ఔట్ చేసినా.. మేయర్స్ చుక్కలు చూపించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆయుష్ బదోనీతో కలిసి రెండో వికెట్‌కు 33 (16) పాట్నర్‌షిప్ అందించాడు.
For his stupendous knock of 72, studded with 6 fours and 5 sixes, @MStoinis is our Top Performer from the first innings.
— IndianPremierLeague (@IPL) April 28, 2023
A look at his batting summary here 👇#TATAIPL pic.twitter.com/jf1GuY8700
బదోనీ.. బంపర్ హిట్!
పవర్‌ప్లే ఆఖరి బంతికి మేయర్స్‌ను సామ్ కరన్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. కానీ మజిల్ మ్యాన్ మార్కస్ స్టాయినిస్ వెరీ కూల్.. అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు జస్ట్ బ్యాటు అడ్డు పెడితే బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది. బదోనీ సైతం గ్యాప్స్ ఫైండ్ చేసి చక్కని బౌండరీలు బాదేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 47 బంతుల్లో 89 రన్స్ పాట్నర్‌షిప్ అందించారు. 13 ఓవర్ల వరకు వికెట్టే ఇవ్వలేదు. వీరిద్దరి వీర బాదుడుకు 12.2 ఓవర్లకే లక్నో స్కెరు 150కి చేరుకుంది. అయితే 13.3వ బంతికి బదోనీని లివింగ్‌స్టోన్ ఔట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఊచకోత మరింత పెరిగింది.
How's that for a MAXIMUM by @nicholas_47.
— IndianPremierLeague (@IPL) April 28, 2023
Live - https://t.co/M9VcNBC4jn pic.twitter.com/4YVdVBPLyE
హల్క్.. పూరన్!
31 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన స్టాయినిస్ మరింత దూకుడు పెంచాడు. 15.5 ఓవర్లకే స్కోరును 200 దాటించాడు. నికోలస్ పూరన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 30 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 239 వద్ద స్టాయినిస్‌ను కరన్ ఔట్ చేశాడు. ఆఖర్లో దీపక్ హుడా (11; 6 బంతుల్లో) పూరన్ నాటు ఇన్నింగ్స్ ఆడాడు. 19.2 ఓవర్లకు స్కోరును 250కి చేర్చాడు. ఆర్సీబీ 263 రికార్డ బ్రేక్ అయ్యేలా కనిపించినా.. ఆఖరి ఓవర్లో పూరన్ ఔటవ్వడంతో లక్నో 257కి సెటిల్ అయింది.
A look at the highest totals in the IPL 👇👇@LucknowIPL finish with a score of 257/5.#TATAIPL pic.twitter.com/ET0PM9UQsv
— IndianPremierLeague (@IPL) April 28, 2023