News
News
వీడియోలు ఆటలు
X

IPL 2023: కోల్‌కతా, పంజాబ్ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? - ముఖాముఖి రికార్డులు ఇలా!

కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి?

FOLLOW US: 
Share:

Indian Premier League 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో రెండోసారి ఆడనుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో కోల్‌కతా ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. నితీశ్ రాణా కెప్టెన్సీలో ఆ జట్టు తొలి 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది. ఇక్కడి నుంచి ఆ జట్టు తర్వాతి 4 మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించిన కేకేఆర్ ప్లేఆఫ్ రేసులో నిలిచింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ ప్రయాణం గురించి చెప్పాలంటే వారు వరుసగా రెండు విజయాలతో సీజన్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

పంజాబ్‌పై కోల్‌కతాదే పైచేయి
కేకేఆర్, పంజాబ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే కోల్‌కతా పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కేకేఆర్ 20 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది.

స్పిన్ బౌలర్లదే పైచేయి
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కేకేఆర్, పంజాబ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు స్పిన్ బౌలర్లదే పైచేయి. ఇప్పటి వరకు 82 మ్యాచ్‌లు ఆడగా, 48 సార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్ ఫలితం గురించి చెప్పాలంటే కోల్‌కతా నైట్ రైడర్స్ పై భారీ పైచేయి కనిపిస్తోంది. జట్టులో సునీల్ నరైన్, సుయాష్ శర్మ రూపంలో ఇద్దరు అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం పంజాబ్ బ్యాట్స్‌మెన్‌కు అంత తేలికైన పని కాదు. ఈ మ్యాచ్‌లో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ఛేజింగ్ చేసే సమయంలో మంచు కారణంగా పరుగులు చేయడంలో కొంత సౌలభ్యం ఉంటుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ అంటే IPL 2023లో ఇప్పటివరకు 52 మ్యాచ్‌లు జరిగాయి. అయితే ప్లేఆఫ్‌లకు వెళ్లే టీమ్స్ గురించి క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు అన్ని జట్లు ప్లేఆఫ్స్ అంటే టాప్-4కి చేరుకోవడానికి రేసులో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ప్రతి జట్టుకు అవకాశం
ఐపీఎల్ 2023లో 52 మ్యాచ్‌లు జరిగినప్పటికీ, ఏ జట్టు కూడా ప్లేఆఫ్ రేసులో నుంచి తప్పుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కానీ ఆ జట్టు కూడా ప్లేఆఫ్ రేసులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ లీగ్ మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని చెప్పడంలో తప్పులేదు.

పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. హార్దిక్ పాండ్యా జట్టు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో రెండో స్థానంలో ఉంది. అయితే చెన్నై ఆడాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో వారు ఒక పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఐపీఎల్‌లో ఎక్కువగా కనిపించింది. కానీ ఈ సీజన్‌లో అలా జరగలేదు. గుజరాత్‌కు 16 పాయింట్లు ఉన్నాయి. కానీ అధికారికంగా ఇంకా అర్హత సాధించలేదు. మరోవైపు లక్నో, రాజస్థాన్‌లు తాము ఆడిన 11 మ్యాచ్‌ల్లో చెరో ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇద్దరికీ ఇప్పటికీ టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.

Published at : 08 May 2023 06:22 PM (IST) Tags: Punjab Kings Shikhar Dhawan Kolkata Knight Riders Nitish Rana IPL 2023 Indian Premier League 2023

సంబంధిత కథనాలు

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!

IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు