News
News
వీడియోలు ఆటలు
X

13కోట్ల బ్రూక్స్ కంటే కోటిన్నర ఫిలిఫ్సే తోపు, సన్ రైజర్స్ విజయంలో కీలక ఇన్నింగ్

సన్ రైజర్స్ విజయంలో కీలకంగా గ్లెన్ ఫిలిఫ్స్

హ్యారీ బ్రూక్ ను తప్పించి గ్లెన్ ఫిలిఫ్స్ కి ఛాన్స్

7బంతుల్లో మ్యాచ్ ను మలుపుతిప్పిన ఫిలిఫ్స్

FOLLOW US: 
Share:

కంటి ముందు రాజస్థాన్  215 పరుగుల లక్ష్యం పెట్టింది సన్ రైజర్స్ కి. ఆరెంజ్ ఆర్మీ కూడా ఇన్నింగ్స్ ని చాలా బాగా మొదలుపెట్టింది. అన్ మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, క్లాసెన్ అందరూ అద్భుతంగా ఆడారు. సమద్ ఇచ్చిన ఫినిషింగ్ అయితే పీక్స్. కానీ రాజస్థాన్ ఓటమికి, సన్ రైజర్స్ గెలుపునకు తేడా గమనిస్తే కనిపించే ఆ ఒక్క  మార్పే గ్లెన్ ఫిలిఫ్స్.

7 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సర్లతో 25  పరుగులు చేశాడు ఫిలిప్స్. కానీ ఆ పరుగులు ఎక్కడ రాబట్టాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్నింగ్స్ 19 ఓవర్ లో రాజస్థాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను టార్గెట్ చేసిన గ్లెన్ ఫిలిఫ్స్ తానెంత విలువైన ఆటగాడినో నిరూపించాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు బాది పారేశాడు. నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి అవుటైపోయాడు. ఆ ఓవర్ 25పరుగులు రావటం సన్ రైజర్స్ టార్గెట్ ను ఈజీ చేసేసింది.

మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పి వెళ్లిపోయాడు గ్లెన్ ఫిలిఫ్స్. ఇన్నాళ్లూ 13కోట్ల 25లక్షలు పెట్టి కొనుక్కున్న హ్యారీ బ్రూక్ ను నమ్ముకుని గ్లెన్ ఫిలిఫ్స్ ను డగౌట్ లోనే కూర్చోబెట్టింది సన్ రైజర్స్. బ్రూక్ తొమ్మిది మ్యాచుల్లో ఓ సెంచరీ అయితే బాదాడు చేసింది మాత్రం 163 పరుగులే. అంటే మిగిలిన మ్యాచుల్లో ఎంత ఫెయిల్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. డకౌట్లు కూడా ఉన్నాయి. కానీ ఒక మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడని ఇన్నాళ్లు తనను రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టినా ఆపర్చునిటీ కోసం ఎదురుచూసిన ఈ కీవీస్ త్రీడీ ప్లేయర్ ఫిలిఫ్స్ మాత్రం సన్ రైజర్స్ ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసొచ్చేలా ఒక్క మ్యాచ్ లోనే నిరూపించుకున్నాడు.

లాస్ట్ ఇయర్ కోటిన్నరకు ఫిలిప్స్ ను కొనుక్కున్న సన్ రైజర్స్ టీమ్ కూర్పులో భాగంగా ఎప్పటికప్పుడు ఫిలిఫ్స్ ను పక్కనపెడుతూ ఇప్పటివరకూ రెండు సీజన్లలో కేవలం 5 మ్యాచ్ లు మాత్రమే ఆడించింది. నిన్న ఫిలిఫ్స్ ఆడిన ఇన్నింగ్స్ కి ఇకపై ఆ తప్పు చేయదనే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ డ్రమెటిక్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది. సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి ఐదు పరుగులు కావాలి. సందీప్ శర్మ వేసిన బంతిని అబ్దుల్ సమద్ బలంగా కొట్టాడు. అది నేరుగా లాంగాఫ్‌లో ఉన్న జోస్ బట్లర్ చేతిలో పడింది. దీంతో రాజస్తాన్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. కానీ అంతలోనే షాక్. సందీప్ వేసింది నోబాల్ అని అంపైర్లు ప్రకటించారు. దీంతో లక్ష్యం ఒక్క బంతికి నాలుగు పరుగులుగా మారింది. ఈ దశలో సందీప్ వేసిన బంతిని అబ్దుల్ సమద్ నేరుగా సిక్సర్‌గా తరలించాడు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టిలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ టార్గెట్‌ను దగ్గరకు తీసుకురాగా, అబ్దుల్ సమద్ ఒత్తిడిలో భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.

Published at : 08 May 2023 11:17 AM (IST) Tags: SRH RR Rajasthan Royals Sunrisers Hyderabad IPL IPL 2023 Glenn Phillips Indian Premier League 2023 RR Vs SRH IPL 2023 Match 52

సంబంధిత కథనాలు

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?