అన్వేషించండి

KKR vs DC: ఆపసోపాలు పడుతూ గెలిచిన ఢిల్లీ - టోర్నీలో ఫస్ట్ విక్టరీ!

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్లతో ఓటమి పాలైంది.

IPL 2023, KKR vs DC: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖాతా తెరిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (57: 41 బంతుల్లో, 11 ఫోర్లు) స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ (19: 22 బంతుల్లో, ఒక ఫోర్) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు.

అంతకు ముందు కోల్‌కతా బ్యాటర్లలో ఈ సీజన్ మొదటి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ జేసన్ రాయ్ (43: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండ్రీ రసెల్ (38 నాటౌట్: 31 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) చివరి వరకు పోరాడాడు.

వార్నర్ వన్ మ్యాన్ షో
128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. పవర్ ప్లేలోనే 60 పరుగులకు పైగా స్కోరును ఢిల్లీ సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57: 41 బంతుల్లో, 11 ఫోర్లు) జట్టును ముందుండి నడిపించాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంత ఫాంలో కనిపించాడో అంత ఫాంలో కనిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా ఇబ్బంది పడ్డ పిచ్ మీద బౌండరీలతో చెలరేగాడు. తనొక్కడే ప్రత్యేకమైన పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నాడా అనిపించింది.

కానీ మరో ఎండ్‌లో తనకు సరిగ్గా సహకారం లభించలేదు. ఒక ఎండ్‌లో తనను నిలబెట్టి పృథ్వీ షా (13: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), మిషెల్ మార్ష్ (2: 9 బంతుల్లో), ఫిలిప్ సాల్ట్ (5: 3 బంతుల్లో, ఒక ఫోర్) వెనుదిరిగారు. సాధ్యం అయినంత వరకు పోరాడిన వార్నర్‌ను 14వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. కానీ కొట్టాల్సిన స్కోరు తక్కువే కావడంతో పడుతూ లేస్తూ అక్షర్ పటేల్ (19: 22 బంతుల్లో, ఒక ఫోర్) టార్గెట్ పూర్తి చేశాడు.

మరో కొత్త ఓపెనింగ్ జోడి
అంతకు ముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా ఈ సీజన్‌లో కొత్త ఓపెనింగ్ ఓడిని ప్రయత్నించింది. జేసన్ రాయ్ (43: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), లిట్టన్ దాస్‌ (4: 4 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా వచ్చారు. అయితే జేసన్ రాయ్ క్రీజులో నిలబడగా, లిట్టన్ దాస్ విఫలం అయ్యాడు. దీంతో 15 పరుగులకే కోల్‌కతా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఒక్కసారిగా కుప్పకూలారు.

వెంకటేష్ అయ్యర్ (0: 2 బంతుల్లో), నితీష్ రాణా (4: 7 బంతుల్లో, ఒక ఫోర్), మన్‌దీప్ సింగ్ (12: 11 బంతుల్లో, ఒక సిక్సర్), రింకూ సింగ్ (6: 8 బంతుల్లో, ఒక ఫోర్), సునీల్ నరైన్ (4: 6 బంతుల్లో, ఒక ఫోర్) ఇలా వరుసగా విఫలం అయ్యారు. పిచ్ నుంచి కూడా కోల్‌కతా బౌలర్లకు చక్కని సహకారం లభించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు పడుతూనే ఉన్నాయి. 15వ ఓవర్ వరకు పోరాడిన జేసన్ రాయ్‌ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ కూడా ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. కానీ చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టడంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. కోల్‌కతా బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. ముకేష్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget