అన్వేషించండి

CSK vs SRH: చెపాక్‌లో టాస్‌ ధోనీదే! తొలుత బ్యాటింగ్‌ ఎవరిదంటే?

CSK vs SRH: చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఎంఎస్ ధోనీ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

CSK vs SRH, IPL 2023: 

చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఎంఎస్ ధోనీ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆకాశం మేఘావృతం కావడంతో గెలుపు అవకాశాలు 50-50 ఉంటాయని అన్నాడు. ఒకవేళ మంచు కురిస్తే ఛేదన సులభం అవుతుందని చెప్పాడు. సేమ్‌ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు.

'మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. మబ్బులు ఉన్నాయి కాబట్టి 50-50 ఛాన్సెస్‌ ఉంటాయి. డ్యూ లేట్‌గా రావొచ్చు. పాయింట్ల పట్టిక గురించి ఆలోచించడం లేదు. మెరుగ్గా ఆడటంపైనే దృష్టి పెడతాం. కాంబినేషన్‌ పరంగా మేం అదృష్టవంతులమే. ఆటగాళ్లు అందరూ అందుబాటులోకి వస్తే తలనొప్పి తప్పదు. జట్టులో మార్పులేమీ లేవు. ఇంపాక్ట్‌ ప్లేయర్లు కూడా సేమ్‌' అని సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అన్నాడు.

'మేం కూడా బౌలింగే చేయాలనుకున్నాం. కేకేఆర్‌పై తొలుత బ్యాటింగ్‌ బాగానే చేశాం. ఇక్కడా అదే ప్రదర్శన చేస్తామని అనుకుంటున్నాం. మేమంతా కలిసి ఆడాలి. ఒక డిపార్ట్‌మెంట్‌లో బాగున్నాం. మిగతా విభాగాల్లో రాణించాలి. దానిపైనే పనిచేస్తున్నాం. జట్టులో ఏ ఒక్కరు బంతిని బాదేసినా మూమెంటమ్‌ మారుతుంది. షెడ్యూలు కాస్త బిజీగానే ఉంది. అయినా మేం ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఐపీఎల్‌ ఉపయోగపడుతుంది. ముంబయి మ్యాచులో ఆడిన జట్టునే బరిలోకి దించుతున్నాం' అని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌ అన్నాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే, అజింక్య రహానె, శివమ్‌ దూబె, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మహీశ్‌ థీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్‌, మతీశ పతిరణ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: హ్యారీ బ్రూక్‌, మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్‌ మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అభిషేక్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో ఎన్‌సన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ మర్కండే, ఉమ్రాన్‌ మాలిక్‌

ఘనమైన రికార్డు.. 

సన్ రైజర్స్ పై ధోనికి మంచి రికార్డు ఉంది.  ఐపీఎల్‌లో ఎస్ఆర్‌‌హెచ్‌పై  18  ఇన్నింగ్స్ ఆడితే అందులో ఏకంగా 488 పరుగులు చేశాడు.  18 ఇన్నింగ్స్ లో 488  పరుగులు చేయడం గొప్పా..? అని విమర్శించేవారూ లేకపోలేదు. కానీ ధోని  బ్యాటింగ్ కు వచ్చేది ఆరో స్థానంలో.  ధోని క్రీజులోకి వచ్చేసరికే దాదాపు  15, 16 ఓవర్లు ముగుస్తాయి. ఆడే బంతులు కూడా తక్కువగా ఉంటాయి.  ఆ సమయంలో  వచ్చి  488 పరుగులు సాధించడమనేది మాటలు కాదు.  సన్ రైజర్స్ పై ధోని సగటు  కూడా  48.80 గా ఉండటం గమనార్హం.  

ఎస్ఆర్‌‌హెచ్‌పై   ధోని 18 ఇన్నింగ్స్ లలో  488 పరుగులు చేయగా ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 8 సార్లు  నాటౌట్ గా ఉండి తన టీమ్ ను గెలిపించుకున్నాడు. 30 ప్లస్ స్కోర్లు కూడా ఆరు సార్లు చేశాడు.  ఈ క్రమంలో   ధోని స్ట్రైక్ రేట్  సైతం  145.24 గా ఉంది. అత్యధిక స్కోరు 37 బంతుల్లో 67 నాటౌట్ గా ఉంది. మరి నేటి మ్యాచ్‌లో ‘తాలా’ను అడ్డుకోకుంటే  సన్ రైజర్స్ బౌలర్లకు మరోసారి బడిత పూజ తప్పదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget