![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CSK vs MI: ధోనీ సేనపై మరీ ఈ రేంజ్ డామినేషనా? ముంబయి రికార్డ్స్!
CSK vs MI, IPL 2023: ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు తలపడ్డా అభిమానులకు పండగే! మరి వీరిలో ఎవరిది పైచేయి? పిచ్ రిపోర్ట్ ఏంటి? రీసెంట్ ఫామ్ ఎలా ఉంది?
![CSK vs MI: ధోనీ సేనపై మరీ ఈ రేంజ్ డామినేషనా? ముంబయి రికార్డ్స్! IPL 2023 CSK vs MI Head to Head records Chepauk pitch report CSK vs MI: ధోనీ సేనపై మరీ ఈ రేంజ్ డామినేషనా? ముంబయి రికార్డ్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/06/e5414db11a0cae5794c2b27c1fa0c8c11683358128560251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CSK vs MI, IPL 2023:
ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు తలపడ్డా అభిమానులకు పండగే! మ్యాచులు ఆఖరి బంతి వరకు థ్రిల్లింగ్‌గానే సాగుతాయి. ఎవరు గెలుస్తారో తెలియక టెన్షన్ పెరుగుతుంది. శనివారం మరోసారి ఈ రెండు జట్లు ఢీకొంటున్నాయి. మరి వీరిలో ఎవరిది పైచేయి? పిచ్ రిపోర్ట్ ఏంటి? రీసెంట్ ఫామ్ ఎలా ఉంది?
ముంబయిదే అప్పర్ హ్యాండ్
ఇండియన్ ప్రీమియర్ లీగులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకు 35 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇన్ని మ్యాచులు మరే జట్ల మధ్యా జరగలేదు. ఎందుకంటే టోర్నీ ఆరంభమైనప్పటి నుంచీ ఎక్కువ ప్లేఆఫ్స్ ఆడిన టీమ్స్ ఇవే! అయితే ధోనీ సేనపై హిట్‌మ్యాన్ బృందానిదే అప్పర్ హ్యాండ్! 35 మ్యాచుల్లో 20 గెలిచింది. 15 ఓడిపోయింది. అంటే విన్ పర్సంటేజీ 57.14. రీసెంట్ ఫామ్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ కాస్త స్ట్రాంగ్‌గా ఉంది. చివరి ఐదు సార్లు తలపడ్డ మ్యాచుల్లో మూడు గెలిచింది. ఈ సీజన్లో మొదటి మ్యాచులోనూ ధోనీసేదే విక్టరీ!
పిచ్ రిపోర్ట్
సహజంగానే చిదంబరం వికెట్ నెమ్మదిగా ఉంటుంది. పిచ్‌లపై ప్యాచెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతో స్పిన్నర్లు కీలకం అవుతారు. అయితే కొత్త బంతితో స్వింగ్ లభిస్తుంది. పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి బంతులు చక్కగా బ్యాటు మీదకు వస్తాయి. నిలబడితే భారీ స్కోర్లు చేయొచ్చు. అయితే ఒక వైపు పెద్ద బౌండరీలు ఉంటాయి. రెండు రోజులుగా చెన్నై వాతావరణం భిన్నంగా ఉంది. మబ్బులు వస్తున్నాయి. శనివారం జల్లులు కురిసే అవకాశం లేకపోలేదు. ఇక్కడ ఇప్పటి వరకు 71 మ్యాచులు జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 43 గెలిచాయి. ఛేదన జట్లు 36 విజయాలు అందుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్
ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.
𝙍𝙚𝙖𝙙𝙮. 𝙎𝙚𝙩. 𝙏𝙞𝙢𝙚 𝙩𝙤 𝙜𝙤 𝙖𝙡𝙡 𝙤𝙪𝙩! 🔥#OneFamily #CSKvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2033 MI TV pic.twitter.com/gg4LvhGjvR
— Mumbai Indians (@mipaltan) May 6, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)