CSK vs LSG: చెన్నై, లక్నో మ్యాచ్ బెస్ట్ డ్రీమ్ 11 ఎలెవన్ ఇదే - కెప్టెన్‌గా ఎవరిని పెట్టచ్చు!
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
CSK vs LSG Best Dream 11 Prediction: ఐపీఎల్ 2023 ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నేడు జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయంపై కన్నేసింది. రెండు జట్లలోనూ గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మ్యాచ్‌లో హోరాహోరీగా సాగనుంది. ఫాంటసీ గేమ్‌లు ఆడే వారి మనస్సులో ఈ మ్యాచ్‌కు సంబంధించి ఒక ప్రశ్న ఉంటుంది. వారి జట్టులో 11 మంది ఆటగాళ్లను చేర్చుకోవాలి. బెస్ట్ 11 మంది ఎలా ఉండవచ్చు.
ఈ ఆటగాడు కెప్టెన్‌గా చేయవచ్చు
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వస్తున్న కైల్ మేయర్స్‌ను మీ జట్టుకు కెప్టెన్‌గా చేసుకోవచ్చు. చివరి మ్యాచ్‌లో కైల్ మేయర్స్ 192 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 73 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అటువంటి పరిస్థితిలో, కైల్ మేయర్స్ మీ ఫాంటసీ టీమ్‌కు మంచి కెప్టెన్‌గా ఆండవచ్చు.
ఈ ఆటగాళ్లు వైస్ కెప్టెన్సీకి మంచి ఎంపికలు
మీరు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను మీ ఫాంటసీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా చేయవచ్చు. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను విఫలమై ఉండవచ్చు. కానీ జడ్డూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో అతను మీకు పరిపూర్ణ వైస్ కెప్టెన్ కావచ్చు.
అదే సమయంలో మీ బెస్ట్ డ్రీమ్ ఎలెవన్ జట్టులో బ్యాట్స్‌మెన్‌గా మీరు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేలను ఎంచుకోవచ్చు. వికెట్ కీపింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఎంపిక కావచ్చు. అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో పాటు ధోనీ మ్యాచ్‌లో ఫినిషింగ్ టచ్ కూడా ఇవ్వగలడు. ఆల్ రౌండర్లలో జడేజాతో పాటు మార్క్ స్టోయినిస్, బెన్ స్టోక్స్ కూడా ఉండవచ్చు. బౌలింగ్‌లో మార్క్ వుడ్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీలను జట్టులోకి తీసుకోవచ్చు.
బెస్ట్ డ్రీమ్ ఎలెవన్ జట్టు ఇలా ఉంటుంది
కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, కైల్ మేయర్స్ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా)
డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్‌గేకర్.