IPL 2023: ఐపీఎల్‌లో అరుదైన క్లబ్‌లో అంబటి రాయుడు - దిగ్గజాల సరసన!
ఐపీఎల్ 2023లో అంబటి తిరుపతి రాయుడు ప్రత్యేకమైన క్లబ్‌లో చేరాడు.
Ambati Rayudu 200th Match, CSK vs DC, IPL 2023: ఐపీఎల్ 2023 55వ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని మహేంద్ర సింగ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అంబటి రాయుడు 17 బంతుల్లో 23 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో అతను 1 ఫోర్, 1 సిక్స్ కొట్టాడు. రాయుడు కెరీర్‌లో ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్. దీంతో ఓ ప్రత్యేక క్లబ్‌లో కూడా చేరిపోయాడు.
ఐపీఎల్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన తొమ్మిదో ఆటగాడు అంబటి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు. మహీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 246 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో దినేష్ కార్తీక్ రెండో స్థానంలో, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, చెన్నైకి చెందిన రవీంద్ర జడేజా ఐదో స్థానంలో, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆరో స్థానంలో, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా 7వ స్థానంలో, రాబిన్ ఊతప్ప 8వ స్థానంలో ఉన్నారు. అంబటి రాయుడు పదో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు
మహేంద్ర సింగ్ ధోనీ: 246 మ్యాచ్‌లు
దినేష్ కార్తీక్: 240 మ్యాచ్‌లు
రోహిత్ శర్మ: 238 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ: 234 మ్యాచ్‌లు
రవీంద్ర జడేజా: 222 మ్యాచ్‌లు
శిఖర్ ధావన్: 214 మ్యాచ్‌లు
సురేష్ రైనా: 205 మ్యాచ్‌లు
రాబిన్ ఉతప్ప: 205 మ్యాచ్‌లు
అంబటి రాయుడు: 200 మ్యాచ్‌లు
IPL 2023లో రాయుడు ఫాం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో రాయుడు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతను 9 ఇన్నింగ్స్‌లలో 16.86 సగటు, 132.58 స్ట్రైక్ రేట్‌తో 188 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 8 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు అతని అత్యధిక స్కోరు 27 నాటౌట్.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. చెన్నై బ్యాటర్లలో ఒక్క బ్యాటర్ కూడా రాణించలేదు. 25 పరుగులే జట్టులో టాప్ స్కోర్. కానీ వచ్చిన వారందరూ చిన్న చిన్న క్యామియోలు ఆడారు. ఈ సిరీస్‌లో మంచి ఫాంలో ఉన్న ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (24: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు), డెవాన్ కాన్వే (10: 13 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యారు. అజింక్య రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
అయితే శివం దూబే (25: 12 బంతుల్లో, మూడు సిక్సర్లు), అంబటి రాయుడు (23: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు చెలరేగారు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని (20: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) మెరుపు సిక్సర్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్ మూడు వికెట్లు తీసుకున్నాడు.