CSK: చెన్నై చరిత్రలో 10వ ఫైనల్ - ఐపీఎల్‌లో ఇంత నిలకడగా!
ఐపీఎల్ చరిత్రలోనే 10 సార్లు ఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.
![CSK: చెన్నై చరిత్రలో 10వ ఫైనల్ - ఐపీఎల్‌లో ఇంత నిలకడగా! IPL 2023: Chennai Super Kings Reached 10th Final of Their 14th IPL Season Csk Won Qualifier 1 Against GT CSK: చెన్నై చరిత్రలో 10వ ఫైనల్ - ఐపీఎల్‌లో ఇంత నిలకడగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/23/a36c71379e321165793214fec6a15f101684857384384689_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chennai Super Kings In IPL: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. అదే సమయంలో మే 23వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆ జట్టు ఐపీఎల్ 2023 ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో 14వ సీజన్‌ను ఆడుతోంది. ఇందులో 10వ సారి ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే.
2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో చెన్నై ఫైనల్స్‌కు చేరుకుంది, అక్కడ రాజస్థాన్ రాయల్స్‌పై జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత, 2010లో ముంబైని ఓడించి జట్టు తన మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. అది చెన్నైకి రెండో ఫైనల్. ఐపీఎల్ 2011లో కూడా చెన్నై ఫైనల్స్‌కు చేరుకుంది. ఆపై టైటిల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.
దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 2012, 2013, 2015లో కూడా ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆ జట్టు కోల్‌కతా చేతిలో ఒకసారి, ముంబై చేతిలో రెండుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ తన మూడో IPL టైటిల్‌ను గెలుచుకుంది. 2019లో కూడా ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ముంబైపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
దీని తర్వాత 2021లో చెన్నై తొమ్మిదో సారి ఫైనల్‌కు చేరుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి నాలుగో టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడం ద్వారా జట్టు ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తన 10వ ఫైనల్ ఆడనుంది. చెన్నై ఇప్పటి వరకు ఆడిన 9 ఫైనల్స్‌లో 5 ఓడిపోయి 4 గెలిచింది.
చెన్నై ఫైనల్ హిస్టరీ
2008 vs రాజస్థాన్ రాయల్స్ - రన్నరప్.
2010 vs ముంబై ఇండియన్స్ - విన్నర్.
2011 vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - విన్నర్.
2012 vs కోల్‌కతా నైట్‌రైడర్స్ - రన్నరప్.
2013 vs ముంబై ఇండియన్స్ - రన్నరప్.
2015 vs ముంబై ఇండియన్స్ - రన్నరప్.
2018 vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – విన్నర్.
2019 vs ముంబై ఇండియన్స్ - రన్నరప్.
2021 vs కోల్‌కతా నైట్‌రైడర్స్ - విన్నర్.
మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో నెహాల్ వధేరా తన స్పెల్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)