AB de Villiers: సూర్య ఫాంలోకి రావాలంటే అదొక్కటే మార్గం - గురుమంత్రం చెప్పిన ఏబీ డివిలియర్స్!
సూర్యకుమార్ యాదవ్ ఫాంలోకి రావాలంటే ఏం చేయాలో ఏబీ డివిలియర్స్ ఒక చిట్కా చెప్పాడు.
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ ముఖ్యమైన ఆటగాడు. అతను గత కొన్ని సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ కోసం అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. కానీ ప్రస్తుతం అతని ఫామ్ అంత బాగా లేదు. భారత్-ఆస్ట్రేలియా మధ్య స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఐపీఎల్‌లో కూడా ఈ బ్యాడ్ ఫామ్ సూర్యను వదలలేదు. ఇప్పుడు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ బ్యాడ్ ఫామ్ నుంచి బయటపడేందుకు సూర్యకు ఒక చిట్కా చెప్పాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు, హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన ఏబీ డివిలియర్స్ తన గేమ్ ప్లాన్‌ను మార్చుకోవద్దని సూర్యకుమార్ యాదవ్‌కు సలహా ఇచ్చాడు.
డివిలియర్స్ మాట్లాడుతూ, అతను (సూర్య) బహుశా ఇప్పుడు ఏదో చేయాల్సిన దశకు వచ్చాడని తెలిపాడు. కానీ దాని రహస్యం ఏమిటంటే భయపడాల్సిన అవసరం లేదని, గేమ్ ప్లాన్‌ను మాత్రం మార్చవద్దని సూచించాడు. ఇన్నాళ్లుగా చేస్తున్న తన ఆటకు కట్టుబడి ఉండాల్సిందే అన్నాడు.
అతను ఇంకా మాట్లాడుతూ, ‘అవును, అతను దానిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. తన ప్రాథమిక అంశాలు ఏమిటి, తను పరుగులు చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటే అతను తన ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లగలడు. మీరు ప్రతి మ్యాచ్‌లోనూ 40 బంతుల్లో 100 పరుగులు చేయలేరు, అది జరగదు.’ అని చెప్పాడు
ఇంకా మాట్లాడుతూ, ‘నేను ఈ విషయం చిన్నస్వామి ప్రేక్షకుల దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌లో నేను సెంచరీ చేస్తానని వారు ఆశించారు. కొన్నిసార్లు నేనే చెప్పుకోవలసి వచ్చింది. మీకు ఏబీ డివిలియర్స్ తెలుసు. మీరు మీతో నిజాయితీగా ఉండాలి. మీరు బంతిని సరిగ్గా చదవడం లేదు. అందుకే మీరు మైదానంలోకి వెళ్లి ఒక్క పరుగు తీసి, విరాట్‌కు స్ట్రైక్ ఇచ్చి, మరొకరు స్కోర్ చేయనివ్వండి. ఆపై క్రమంగా నేను మంచి ఫాంలోకి వచ్చాను. ఆపై నా అసలు ఆట బయటకి వచ్చింది.’ అన్నాడు. ఈ విధంగా ఏబీ డివిలియర్స్... సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌లోకి రావాలని సూచించాడు. మరి తదుపరి మ్యాచ్‌లో సూర్య ఎలాంటి అద్భుతం చూపిస్తాడో చూడాలి.
టీ20లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్.. బరిలోకి దిగితే సిక్సర్ల మోతతో ప్రత్యర్థులను హడలెత్తించే టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది. అతడు టీ20లకు తప్ప మిగిలిన ఫార్మాట్లకు పనికిరాడా..? వన్డేలు ఆడటం సూర్యకు చేతకాదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. మాజీ క్రికెటర్ల అభిప్రాయాలు, ఫ్యాన్స్ విమర్శలు, టీమ్ మేనేజ్మెంట్ ఆందోళన కంటే కూడా వన్డేలలో
సూర్య గణాంకాలు చూస్తే ఇదే నిజమనిపించిక మానదు. టీ20లలో బంతి పడితే దానిని 360 డిగ్రీల కోణంలో ఆడే సూర్య.. వన్డేలలో మాత్రం కనీసం క్రీజులో నిలుచోడానికే తంటాలు పడుతున్నాడు. అతడి ప్రదర్శనలతో విసిగిపోయిన అభిమానులు.. అతడు ‘సూర్య’కుమార్ కాదు.. ‘శూణ్య’కుమార్ అని ఆటాడుకుంటున్నారు.