Virat Kohli: సెంచరీ లేకుండా సెంచరీ చేశాడు! కోహ్లీ ఖాతాలో కోరుకోని రికార్డు!
Virat Kohli: కెరీర్లో అద్భుతమైన రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ ఈ సారి మాత్రం కోరుకోని రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అదే సెంచరీ చేయకుండానే సెంచరీ మ్యాచులు ఆడటం!
IPL 2022: Virat Kohli gone 100 matches across all formats Test, ODI, T20 without century, Know More in Detail : ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ఛేదన రారాజు. ఒంటిచేత్తో ఎన్నో అసాధారణమైన మ్యాచులను గెలిపించాడు. టీమ్‌ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహించాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన రికార్డులను బద్దలు కొట్టాడు. అలాంటి విరాట్ కోహ్లీ ఈ సారి మాత్రం కోరుకోని రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అదే సెంచరీ చేయకుండానే సెంచరీ మ్యాచులు ఆడటం!
ప్రస్తుతం విరాట్ కోహ్లీ మెరుగైన ఫామ్‌లో లేడు. నిలకడగా పరుగులు చేయడం లేదు. ఒక ఇన్నింగ్స్‌లో అలరిస్తుంటే మరో ఇన్నింగ్సులో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ 2022లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో విరాట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అతడు సెంచరీ చేయకుండా వంద మ్యాచులు ఆడినట్టైంది. 2019 నుంచి అతడికి సెంచరీలు లేవు. చివరి సారిగా ఏ ఫార్మాట్లోనైనా బంగ్లాదేశ్‌పై శతకం బాదాడు. ఆ తర్వాత 17 టెస్టులు, 21 వన్డేలు, 25 టీ20లు, 37 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. అతడి సెంచరీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
టెస్టు క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే విరాట్ కోహ్లీకి టీ20ల్లోనూ తిరుగులేదు. 2016 ఐపీఎల్‌లో అతడు నాలుగు సెంచరీలు కొట్టాడు. లీగు హిస్టరీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతడే. 214 మ్యాచుల్లో 6,402 పరుగులు చేశాడు. ఐదు సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లన్నీ కలిపి 23,650 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఏదో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ 7 మ్యాచులాడి 19.83 సగటుతో 119 పరుగులే చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై 41 నాటౌట్, ముంబయి ఇండియన్స్‌పై 48 టాప్ స్కోర్లు. మిగతా మ్యాచుల్లో వరుసగా 12, 5, 1, 12, 0 పరుగులే చేశాడు. అతడు ఫామ్‌లోకి రావడం బెంగళూరుకే కాకుండా టీమ్‌ఇండియాకూ అవసరం. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్లో జరిగే ప్రపంచకప్‌లో గెలవాలంటే అతడి బ్యాటు నుంచి పరుగుల వరద పారాల్సిందే.
View this post on Instagram
View this post on Instagram