IPL 2022, MS Dhoni vs Varun chakravarthy: ఈ చెన్నై కుర్రాడి బౌలింగంటే ధోనీకెందుకంత భయం? ఈరోజు ఎలా ఆడతాడో?
IPL 2022 Records: ఐపీఎల్ 15వ సీజన్ (IPL 2022) తొలి మ్యాచులో చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Superkings), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. వరుణ్ చక్రవర్తి, ఎంఎస్ ధోనీ బ్యాటిల్పై ఆసక్తి నెలకొంది.
IPL 2022 Records: ఇండియన్ టీ20 కార్నివాల్‌కు వేళైంది! ఐపీఎల్ 15వ సీజన్ (IPL 2022) తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Superkings), గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. ఇప్పటికే రెండు జట్లూ ప్రాక్టీస్ ముగించాయి. రెండింటికీ కొత్త కెప్టెన్లే కావడంతో అభిమానులు ఆసక్తిగా మ్యాచు కోసం ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచుకు (CSK vs KKR) ముందు కొన్ని గణాంకాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
* ఈ ఐపీఎల్‌కు ముందు సీఎస్‌కే, కేకేఆర్ 25 సార్లు తలపడ్డాయి. 17 సార్లు చెన్నై సూపర్‌కింగ్స్ గెలిస్తే 8 సార్లే కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచింది.
* చివరి ఐదు మ్యాచుల్లోనూ సీఎస్‌కేదే డామినేషన్. ఫైనల్ సహా వరుసగా నాలుగు మ్యాచులు గెలిచింది. కేకేఆర్ ఒక విజయానికే పరిమితమైంది.
* ఇప్పుడున్న అన్ని జట్లతో పోలిస్తే వాంఖడేలో కేకేఆర్‌దే అత్యల్ప విన్నింగ్ పర్సెంటేజీ! 11 మ్యాచులాడితే ఒకే ఒక్కటి గెలిచింది.
* వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy), ఎంఎస్ ధోనీ (MS Dhoni) మధ్య పోరాటం ఆసక్తి రేకెత్తిస్తోంది. చెన్నైతో తలపడిన మూడు మ్యాచుల్లో మూడుసార్లు ఎంఎస్ ధోనీని ఈ మిస్టరీ స్పిన్నరే ఔట్ చేశాడు.
* ఇక సునిల్ నరైన్ (Sunil Narine) బౌలింగ్‌లోనూ ధోనీకి మెరుగైన రికార్డు లేదు. టీ20 క్రికెట్లో అతడు వేసిన 83 బంతుల్లో 44 పరుగులే చేశాడు. రెండుసార్లు ఔటయ్యాడు.
* డ్వేన్ బ్రావో (Dwane Bravo) బౌలింగ్ అంటే ఆండ్రీ రసెల్‌కు (Andre Russell) పిచ్చి! అతడి బౌలింగ్‌లో కొట్టినన్ని సిక్సర్లు ఇంకెవ్వరి బౌలింగ్‌లో కొట్టలేదు. టీ20ల్లో అతడి బౌలింగ్‌లో 23 సిక్సర్లు దంచాడు.
* ముంబయి వాంఖడేలో (Wankhede Stadium) అంబటి రాయుడికి (Ambati Rayudu) తిరుగులేని రికార్డు ఉంది. 48 ఐపీఎల్ మ్యాచుల్లో అక్కడ 885 పరుగులు చేశాడు. ఈ వేదికలో అతడి కన్నా ఎక్కువగా కీరన్ పొలార్డ్ (Pollard), రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రమే పరుగులు చేశారు.
* సీఎస్‌కే డేవాన్ కాన్వేకు స్పిన్ బౌలింగ్‌పై అద్భుతమైన రికార్డుంది. స్వీప్, రివర్స్ స్వీప్‌తో పరుగులు చేస్తాడు. టీ20ల్లో స్పిన్‌పై అతడికి సగటు 61, స్ట్రైక్‌రేట్ 134గా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ బౌలింగ్‌ను అతడు ఊచకోత కోశాడు. కేకేఆర్‌లో నబీ ఉన్నాడు.
Probable Playing XI
చెన్నై సూపర్ కింగ్స్ : 1 రుతురాజ్ గైక్వాడ్, 2 రాబిన్ ఉతప్ప, 3 డేవాన్ కాన్వే, 4 అంబటి రాయుడు, 5 రవీంద్ర జడేజా, 6 శివమ్ దూబె, 7 ఎంఎస్ ధోనీ, 8 డ్వేన్ బ్రావో, 9 రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, 10 క్రిస్ జోర్డాన్ / మహీశ్ తీక్షణ, 11 ఆడమ్ మిల్న్
కోల్‌కతా నైట్ రైడర్స్: 1 వెంకటేశ్ అయ్యర్, 2 అజింక్య రహానె, 3 శ్రేయస్ అయ్యర్, 4 నితీశ్ రాణా, 5 సామ్ బిల్లింగ్స్, 6 ఆండ్రీ రసెల్, 7 సునిల్ నరైన్, 8 చామిక కరుణరత్నె, 9 శివమ్ మావి 10 వరున్, 11 వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ / రసిఖ్ సలామ్ దార్