SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్‌లో ఆదివారం జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ బెర్తులు ఇప్పటికే ఖరారైపోయినందున ఈ మ్యాచ్‌కు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. అయితే ఎవరు ఎక్కువ తేడాతో విజయం సాధిస్తే వారు ఐదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు
అభిషేక్ శర్మ, ప్రియం గర్గ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీష సుచిత్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఫజల్‌హక్ ఫరూకీ, ఉమ్రాన్ మలిక్
పంజాబ్ కింగ్స్ కింగ్స్ తుదిజట్టు
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియాం లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, ప్రేరక్ మన్కడ్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్
View this post on Instagram
View this post on Instagram