SRH Vs CSK: టాస్ గెలిచిన కేన్ మామ - బౌలింగ్‌కే ఫిక్స్ అయ్యారుగా - చెన్నైలో ధోని మార్కు మార్పులు!
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆదివారం రాత్రి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. చెన్నై జట్టులో రెండు మార్పులు జరిగాయి. డ్వేన్ బ్రేవో స్థానంలో డెవాన్ కాన్వే, శివం దూబే స్థానంలో సిమర్‌జిత్ సింగ్ జట్టులోకి వచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, డెవాన్ కాన్వే, అంబటి రాయడు, సిమర్‌జిత్ సింగ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిషెల్ శాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్, ముకేష్ చౌదరి, మహీష్ ధీక్షణ
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మలిక్, టి నటరాజన్
View this post on Instagram
View this post on Instagram