IPL 2022, RCB: ఈ సాలా కెప్టెన్ మారిండు! డుప్లెసిస్‌కు బిగ్ టెస్టు పెట్టిన కోహ్లీ, RCB
IPL 2022, RCB: IPLలో హార్డ్ కోర్ ఫ్యాన్‌బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers bangalore) ఒకటి. మెగా వేలం తర్వాత ఆర్‌సీబీ (RCB) ఎలా ఉంది? ఆటగాళ్ల ఎంపిక బాగుందా? ఐపీఎల్ 15లో ప్లేఆఫ్ చేరుతుందా?
IPL 2022, Royal challengers bangalore swot analysis: ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) హార్డ్ కోర్ ఫ్యాన్‌బేస్ ఉన్న జట్టది! ప్రతి సీజన్లో భారీ అంచనాలతోనే బరిలోకి దిగుతుంది. 'ఈ సాలా నమదే కప్' అంటూ ఊరిస్తుంది. ఆఖరికి 'వచ్చే సాలా చూసుకుందాంలే' అనుకుంటూ ఉసూరుమంటోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే (Royal challengers bangalore) ఆ జట్టని మీకర్థమయ్యే ఉంటుంది! మెగా వేలం తర్వాత ఆర్‌సీబీ (RCB) ఎలా ఉంది? ఆటగాళ్ల ఎంపిక బాగుందా? ఐపీఎల్ 15లో ప్లేఆఫ్ చేరుతుందా?
కెప్టెన్ మార్పుతో లక్కు మారుతుందా?
ఐపీఎల్‌లో (IPL 2022) మంచి ఫ్యాన్‌బేస్ ఉన్న జట్టు ఆర్‌సీబీ. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టును నడిపించాడు. ఏబీ డివిలియర్స్ (ab de villiers) వంటి లెజెండ్ అతడి పక్కన ఉండేవాడు. ప్రతిసారీ కప్ కోసమే బరిలోకి దిగుతున్నామని చెప్పేవాళ్లు. భారీ అంచనాల ఒత్తిడిని ఎదుర్కోలేక, ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో ఆగిపోయేవారు. 2022లో ఈ జట్టులో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పట్నుంచి విరాట్‌పై కెప్టెన్సీ భారం లేదు. మిగతా బాధ్యతలూ లేవు. ఆర్‌సీబీ ఈసారి డుప్లెసిస్‌ను (Faf Du Plessis) కెప్టెన్‌గా ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి కెప్టెన్‌గా మంచి అనుభవం ఉంది. పైగా జట్టుకు విలువను తీసుకొస్తాడు. ఒత్తిడిని తట్టుకోగలడు.
RCB కోర్ గ్రూప్ పర్లేదు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన కోర్‌టీమ్‌ను చక్కగానే నిర్మించుకుంది. వేలానికి ముందే విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ (Maxwell), మహ్మద్ సిరాజ్‌ను రీటెయిన్ చేసుకుంది. ఇప్పుడు కోర్‌గ్రూప్‌లోకి డుప్లెసిస్, మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (Dinesh karthik), హర్షల్ పటేల్ వచ్చారు. చక్కని భవిష్యత్తు, సత్తా ఉన్న ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal), మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను (Yuzvendra Chahal) వేలంలో దక్కించుకోలేకపోయింది. గతంలో ఆర్‌సీబీ అంటే బ్యాటింగ్‌కు మారుపేరుగా ఉండేది. టాప్ ఆర్డర్ భీకరంగా ఉండేది. బౌలింగ్ మాత్రం నిస్సారంగా కనిపించేది. ఈసారి మాత్రం డిస్ట్రక్టివ్ అని చెప్పలేం! మిడిలార్డర్లో అనుభవ రాహిత్యం కనిపిస్తోంది. బౌలింగ్ విభాగం మాత్రం మెరుగ్గా ఉంది. సిరాజ్ (Mohammad Siraj), బెరెన్‌డార్ఫ్, హర్షల్ పటేల్ (Harshal Patel), హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, వనిందు హసరంగ (Wanidu Hasaranga), డేవిడ్ విల్లేతో నిండుగా కనిపిస్తోంది.
RCB Probable XI
ఆర్‌సీబీ ఓపెనర్లుగా డుప్లెసిస్, విరాట్ కోహ్లీ వస్తారు. విరాట్ వద్దనుకుంటే మరో కొత్త కుర్రాడు లవనీత్ సిసోడియాకు అవకాశం ఇవ్వాలి. అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ వరుసగా 3, 4, 5లో ఆడతారు. 6, 7, 8లో మహిపాల్ లోమ్రర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ వస్తారు. వీరిలో ఎవరూ డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ కారు. మ్యాచ్ ఫినిషర్లు అంతకన్నా కారు. దాంతో మాక్సీ, డీకేపై ఎక్కువ భారం పడుతుంది. హర్షల్ పటేల్, జోష్ హేజిల్ వుడ్, మహ్మద్ సిరాజ్ ఆఖరి మూడు స్థానాల్లో ఉంటారు. బౌలింగ్ పరంగా ఆర్‌సీబీ చక్కగా ఉంది. ఎక్కువ బౌలింగ్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
ఫ్లేఆఫ్ వరకు అంచనా వేయొచ్చు!
ఆర్‌సీబీ ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్లో ఓడిపోయింది. ఈ స్థాయి జట్టు ఎప్పుడో ఐపీఎల్ ట్రోఫీ గెలవాలి. ఒకప్పుడు ఇందులో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్ వంటి డిస్ట్రిక్టివ్ బ్యాటర్లు ఉన్నారు. కానీ ప్రతి సీజన్లోనూ జట్టు కూర్పు కుదిరేది కాదు. బౌలింగ్‌లో దెబ్బతినేవాళ్లు. లేదంటే మ్యాచ్ ఫినిషర్లు కరవయ్యేవాళ్లు. ఈసారీ టాప్ ఆర్డర్, బౌలింగ్ యూనిట్లు బాగున్నా మిడిలార్డర్, మ్యాచ్ ఫినిష్ చేసేవాళ్లు కనిపించడం లేదు. ముఖ్యంగా కోహ్లీ స్పిన్నర్ల బౌలింగ్‌లో దొరికిపోతున్నాడు. టీ20 ఫార్మాట్ ఫామ్‌లో లేడు. అన్నీ బాగా కుదిరితే ఆర్‌సీబీ ప్లేఆఫ్ చేరుకోవచ్చు. ఇందుకు మాక్సీ, డీకే ఫామ్ అత్యంత కీలకం.
Also Read: DC మనసుల గెలుపునకు BC ఇవ్వండి! ఇకనైనా IPL ట్రోఫీ గెలవండి!
Also Read: హిట్‌మ్యాన్ ఉండగా భయమేల! కానీ పాండ్య బ్రదర్స్ ఫినిషర్స్ లోటు తీర్చేదెవరు MI?
Also Read: వీక్‌నెస్ లేని ఏకైక జట్టు - పేపర్ పైన ది బెస్ట్! LSG ప్లేఆఫ్ గ్యారంటీనే!