By: ABP Desam | Updated at : 22 May 2022 12:45 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రిషభ్ పంత్ (BCCI)
Rishabh Pant: ముంబయి ఇండియన్స్ బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై రివ్యూ తీసుకోకపోవడానికి రిషభ్ పంత్ కారణం చెప్పాడు. అంతర్ వృత్తంలోని ఫీల్డర్లు ఎవరూ ఏమీ చెప్పలేకపోయారని పేర్కొన్నాడు. ఎవరూ ఆత్మవిశ్వాసంతో కనిపించకపోవడంతోనే సమీక్ష కోరలేదని వెల్లడించాడు. ముంబయి చేతిలో ఓటమి పాలయ్యాక రిషభ్ మీడియాతో మాట్లాడాడు.
159 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి అంత సౌకర్యంగా కనిపించలేదు. దిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. చాలా సందర్భాల్లో గేమ్‌ను వారు తమవైపుకు తిప్పారు. అయితే కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ఒకే ఒక్క పొరపాటు వారి ప్లేఆఫ్స్ ఆశలను చిదిమేసింది.
బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్ ఆడిన తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతి అతడి బ్యాటుకు అంచుకు తగిలి రిషభ్ పంత్ చేతుల్లో పడింది. అయితే అంపైర్ ఔటివ్వడంలో విఫలమయ్యాడు. ఆ పరిస్థితుల్లో పంత్ కచ్చితంగా రివ్యూకు వెళ్తాడనే అంతా భావించారు. కానీ అతడలా చేయలేదు. దాంతో ఆశ్చర్యపోవడం అందరి వంతూ అయింది.
దిల్లీ ఆటగాళ్లంతా రిషభ్ పంత్ దగ్గరికి వచ్చారు. ఏదో మాట్లాడారు. సర్ఫరాజ్ ఖాన్ అయితే కెప్టెన్‌ను ఒప్పించేందుకు గట్టిగానే ప్రయత్నించినట్టు కనిపించింది. పంత్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఆ తర్వాత అల్ట్రాఎడ్జ్‌లో చూస్తే స్పైక్ వచ్చినట్టు రిప్లేలో కనిపించింది. తప్పుచేశానని తెలుసుకున్న పంత్ నిరాశ చెందాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదుతూ 35 పరుగులు చేశాడు.
'టిమ్ డేవిడ్ తొలి బంతి ఆడినప్పుడు ఏదో అనిపించింది. రివ్యూ తీసుకుందామా అని అడిగాను. అంతర్‌వృత్తంలో నిలబడ్డ ఫీల్డర్లు ఎవరూ కాన్ఫిడెంట్‌గా చెప్పలేదు. దాంతో నేను రివ్యూకు వెళ్లలేదు' అని పంత్ అన్నాడు. ఏదేమైనా మరోసారి దిల్లీ క్యాపిటల్స్ కప్ గెలుచుకొనే అవకాశం మిస్ చేసుకుంది.
Our season ends with a 💔 at Wankhede.#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals | #MIvsDC pic.twitter.com/zW5DEDL3wH
— Delhi Capitals (@DelhiCapitals) May 21, 2022
Gave everything tonight together, @mipaltan 🤝
— Delhi Capitals (@DelhiCapitals) May 21, 2022
Can't wait for our DC boys to face-off with your तोड़फोड़ मंडळ next season 💯#MIvDC pic.twitter.com/E1FVAen6io
We Rise. We Fall. We Roar. 𝗧𝗢𝗚𝗘𝗧𝗛𝗘𝗥 💯
— Delhi Capitals (@DelhiCapitals) May 22, 2022
A season that's had its fair bit of challenges and turnarounds but above all, it's been a season where we've given our all from Day 1. And we'll always be proud of our fight 🫶🏼
𝐒𝐡𝐮𝐤𝐫𝐢𝐲𝐚, 𝐃𝐢𝐥𝐥𝐢 ❤️💙#YehHaiNayiDilli pic.twitter.com/mTfR2XFKO2
Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ
IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కులపై జే షా కీలక కామెంట్స్!
IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!
IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్స్క్రిప్షన్ రూ.300 లోపే!
IPL Media Rights: బీసీసీఐ మీద కనకవర్షం - రూ.44 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్ - ఎవరికి దక్కాయంటే?
Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల