IPL 2022 RR vs RCB: నేడు ఆర్సీబీతో మ్యాచ్ - దినేష్ కార్తీక్‌పై రాజస్థాన్ రాయల్స్ చేసిన ట్వీట్ వైరల్, అందులో ఏముందంటే !
IPL 2022 RR vs RCB Match Updates: నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పుణే వేదిగా తలపడుతున్నాయి. దినేష్ కార్తీక్‌ను ఉద్దేశించి రాజస్థాన్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Rajasthan Royals Tweet over Dinesh Karthik: ఐపీఎల్ 2022లో అదరగొడుతున్న ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ ఒకరు. టీమిండియా సీనియర్ ఆటగాడు ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. లేటు వయసులోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయాలలో కీలక పోషిస్తున్నాడు కార్తీక్. ఐపీఎల్ 15 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లలో కార్తీక్ 209 పరుగులు సాధించాడు. మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధించడం అంత తేలిక కాదు. కానీ దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు కార్తీక్.
రాజస్థాన్ ప్లాన్ తెలిస్తే షాక్ !
ఐపీఎల్ 2022లో 39వ మ్యాచ్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పుణే వేదిగా తలపడుతున్నాయి. అయితే దినేష్ కార్తీక్‌ను ఉద్దేశించి రాజస్థాన్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దినేష్ కార్తీక్.. ముంబై - పుణే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. నువ్వు ఈ మార్గంలో సులువుగా పుణే చేరుకోగలవు అని గోవా, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మీదగా పుణె చేరుకోవాలని కార్తీక్‌కు సూచిస్తూ రాజస్థాన్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తూ ఆర్సీబీకి విజయాలు అందిస్తున్న దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా మ్యాచ్ వీక్షించేందుకు తరలివస్తున్నారని రాజస్థాన్ రాయల్స్ టీమ్ అభిప్రాయం. అదే సమయంలో దినేష్ కార్తీక్ వేరే రూట్‌లో పుణె చేరుకోవచ్చునని చెబుతూ.. రాజస్థాన్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండొద్దని ప్రత్యర్ధి టీమ్ భావిస్తుందని.. దటీజ్ దినేష్ కార్తీక్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Hey @DineshKarthik, seems like there's heavy traffic on the Mumbai-Pune express highway, here's a shorter route: pic.twitter.com/SjsZzZ1v0h
— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2022
ఆర్సీబీ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
రాజస్థాన్ టీమ్ ఇచ్చిన సలహాను జాస్ బట్లర్‌కు ఇస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ముంబై - పుణె మధ్య భారీ ట్రాఫిక్ ఉందని, ఇదే షార్ట్ కట్ రూట్ అని నెటిజన్లు, ఆర్సీబీ ఫ్యాన్స్ రాజస్థాన్ టీమ్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తున్నారు. బట్లర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ, కార్తీక్ అంటే రాజస్థాన్ భయపడటం బాగుందని కొందరు ఆర్సీబీ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. దినేష్ కార్తీక్‌ను ఎలా ఔట్ చేయాలో సైతం రాజస్థాన్ కెప్టెన్‌కు ఆ టీమ్ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.
Hey @josbuttler, seems like there's heavy traffic on the Mumbai-Pune express highway, here's a shorter route: pic.twitter.com/HUPWroc519
— Jitendra 🎶 (@Jitendr63761289) April 26, 2022
కార్తీక్ బ్యాటింగ్‌కు వస్తే.. యుజువేంద్ర చహల్‌కు బౌలింగ్ ఇవ్వాలని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు రాజస్థాన్ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. నేను హెలికాప్టర్‌లో వస్తున్నాను బేబీ అంటూ రాజస్థాన్‌కు ఆర్సీబీ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడంతో ఆర్ఆర్ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది. కాగా, డీకే బ్యాటింగ్ చూశాక తనకు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని బరిలోకి దిగాలని ఉందని దక్షిణాఫ్రికా విధ్వంసకర క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కామెంట్ చేశాడంటేనే కార్తీక్ ఎంతలా ప్రభావం చూపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
Also Read: AB De Villiers On DK: 360 డిగ్రీల్లో డీకే బాదేస్తోంటే 'రిటైర్మెంట్' వెనక్కి తీసుకోవాలనిపిస్తోంది!