అన్వేషించండి

LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (41: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), దేవ్‌దత్ పడిక్కల్ (39: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించారు. లక్నో విజయానికి 120 బంతుల్లో 179 పరుగులు కావాలి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ (2: 6 బంతుల్లో)... అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. కానీ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజు శామ్సన్ (32: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు) వేగంగా ఆడుతూ రన్‌రేట్ తగ్గనివ్వలేదు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు.

అయితే సంజు శామ్సన్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ రెండు పరుగుల వ్యవధిలోనే అవుటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ కాసేపు విధ్వంసం సృష్టించాడు. ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దేవ్‌దత్ పడిక్కల్... కృనాల్ పాండ్యా చేతికి చిక్కాడు.

ఆ తర్వాత రియాన్ పరాగ్ (17: 16 బంతుల్లో, ఒక సిక్సర్), జిమ్మీ నీషం (14: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) ఆశించినంత వేగంగా ఆడకపోయినా ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (17 నాటౌట్: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) చిన్నపాటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్ కెరీర్‌లో మొదటి ఫోర్ ఈ మ్యాచ్‌లోనే కొట్టాడు. గతంలో తన ఖాతాలో ఒక సిక్సర్ మాత్రమే ఉంది. 

రాజస్తాన్ తరఫున ఏకంగా ఎనిమిది మంది బౌలింగ్ చేశారు. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా... అవేష్ ఖాన్, జేసన్ హోల్డర్, అయుష్ బదోనిలకు తలో వికెట్ దక్కింది.

View this post on Instagram
 
A post shared by IPL (@iplt20)

టాప్ హెడ్ లైన్స్

National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget