By: ABP Desam | Updated at : 09 Apr 2022 01:15 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రాహుల్ తెవాతియా (image credit: Rahul tewatia twitter)
IPL 2022, PBKS vs GT Rahul Tewatia Memes: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ అజేయమైన జట్టుగా మారింది. వరుసగా మూడు మ్యాచులాడి మూడూ గెలిచింది. ఇప్పటి వరకు ఓటమే తెలియకుండా ఆడుతోంది. అద్భుతమైన బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్ డెప్త్ ఆ జట్టు సొంతం. రాహుల్ తెవాతియా వంటి మ్యాచ్ ఫినిషర్లు ఉండటంతో భారీ లక్ష్యాలను సునాయాసంగా ఛేదిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేస్తే పెద్ద టార్గెట్లు సెట్ చేస్తున్నారు. ఇక పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో రాహుల్ తెవాతియా ఆటకు అంతా ఫిదా అవుతున్నారు. ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి గెలిపించడం అసాధారణ ఫీట్‌గా మారింది. మీమ్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
గిల్ మొదలు పెడితే తెవాతియా థ్రిల్ చేశాడు
190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ మాథ్యూ వేడ్ వైఫల్యాల పరంపర ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగింది. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (96: 59 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), కొత్త ఆటగాడు సాయి సుదర్శన్ (35: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి భారీ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి పంజాబ్ 53 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఏమాత్రం తడబడకుండా ఆడారు. వీరు దూకుడుగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 94-1కు చేరుకుంది. ఈ లోపే శుభ్‌మన్ గిల్ అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సుదర్శన్ అవుటయ్యాడు.
అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయితే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టం అయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో 19వ ఓవర్లో సెంచరీ ముంగిట శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. చివరి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించి హార్దిక్ పాండ్యా కూడా వికెట్ కోల్పోయాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సిన దశలో రాహుల్ టెవాటియా వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.
#Tewatia was not a fluke 😳🔥 pic.twitter.com/DHup5w8cO1
— Cricket wala ladka (@cricketwalaldka) April 8, 2022
Tonight's dressing room's condition #Tewatia pic.twitter.com/fT1yaojyFS
— Yash (@Yashrajput027) April 8, 2022
Rahul tewatia saw cottrell in odeon smith
— Nitesh Sharma (@Nitesh27062000) April 8, 2022
#GTvsPBKS #tewatia pic.twitter.com/J2ZBlB24xa
punjab kings fans watching #tewatia snatching victory from their mouth #GTvsPBKS pic.twitter.com/7yc7bQL1K3
— ABINASH KATOCH ॐ (@_Katoch_) April 8, 2022
#GTvPBKS #PBKSvGT #GujaratTitans #tewatia
— Ambuj 🇮🇳 (@ambuj_jii) April 8, 2022
.
Tewatia to Gujrat Squad ; pic.twitter.com/h7E1sss6zP
#GT welcoming the new Finisher #Tewatia the Boss #GTvsPBKS pic.twitter.com/vOrQKotBD0
— JEETU (@Jitendra0917) April 8, 2022
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ ప్రమోషన్! ఐర్లాండ్ టూర్లో టీమ్ఇండియాకు కెప్టెన్సీ!!
Rajat Patidar: 'అన్‌సోల్డ్'గా మిగిలి 'అన్‌టోల్డ్ స్టోరీ'గా మారిన రజత్ పాటిదార్
LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్‌కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు