IPL 2022 MI vs LSG Memes: ముంబై టీమ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్, డబుల్ హ్యాట్రిక్ ఓటములపై ఫన్నీ మీమ్స్ ట్రెండింగ్
IPL 2022 LSG vs MI Memes: ముంబై ఇండియన్స్ డబుల్ హ్యాట్రిక్ ఓటములపై ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముంబై ఏం చేస్తుందని ప్రశ్నిస్తూ ఫ్యాన్స్ మీమ్స్ వార్‌ను కొనాసాగిస్తున్నారు.
IPL 2022, Match 26 MI vs LSG Best Memes from Mumbai Indians vs Lucknow Super Giants Match
IPL 2022 MI vs LSG Memes: ముంబై టీమ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్, డబుల్ హ్యాట్రిక్ ఓటములపై ఫన్నీ మీమ్స్ ట్రెండింగ్
ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) ఐపీఎల్ 2022 సీజన్ ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఐపీఎల్ 15లో ఇప్పటివరకూ ఖాతా తెరవని ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా ఆరో మ్యాచులోనూ ఓటమి చవిచూసింది. ముంబైపై లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు వరుసగా ఆరో మ్యాచ్‌లో ఓడిన మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇలా వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిన మూడో జట్టుగా నిలిచింది ముంబై.
ఛేజింగ్ చేసినా లాభం లేదు..
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (103*; 60 బంతుల్లో 9x4, 5x6) అజేయ శతకం సాధించాడు. మనీశ్ పాండే (38; 29 బంతుల్లో 6x4), క్వింటన్ డికాక్ (24; 13 బంతుల్లో 4x4, 1x6) రాణించడంతో లక్నో టీమ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ముంబై ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. కానీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ మరోసారి తడబాటుకు లోనైంది. లక్నో బౌలర్లు వరుస విరామాలలో వికెట్లు తీయడంతో నిర్ణీత ఓవర్లలో 181/9 కు పరిమితమైంది.సూర్యకుమార్ యాదవ్ (37; 27 బంతుల్లో 3x4), డీవాల్డ్ బ్రూవిస్ (31; 13 బంతుల్లో 6x4, 1x6), కీరన్ పొలార్డ్ (25; 14 బంతుల్లో 1x4, 2x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. తద్వారా సీజన్‌లో వరుసగా 6వ ఓటమి చవిచూసిన ముంబై ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు.
ముంబై జట్టుపై ఫన్నీ మీమ్స్..
ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం Delhi Capitals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడిన చెత్త రికార్డును కలిగి ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ చేరిపోయింది. ఈ సీజన్‌లో విజయాల ఖాతా తెరువని మాజీ ఛాంపియన్ ముంబై టీమ్‌పై మీమర్స్ ఫన్నీ మీమ్స్ వదిలారు. రోహిత్ శర్మ సేనపై ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాయంట్ల పట్టికలో టాప్‌లో ఉంటే ఫస్ట్ లవ్ వాళ్లకు సొంతమట అయితే ఈసారి కింద నుంచి ప్రేమను పంచాలంటూ ముంబై టీమ్‌పై మీమర్స్ సెటైర్స్ పేల్చుతున్నారు.
— 🅱🆄🅽🅽🆈🥳🌈 (@aakash_lakhia) April 16, 2022
ఇంపార్టెంట్ మ్యాచ్‌లో రన్స్ చేయాలా.. లేక భార్య బర్త్‌డే రోజు స్కోర్ చేయాలా అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆలోచిస్తున్నట్లు మీమ్ ట్రెండ్ అవుతోంది.
#MIvLSG pic.twitter.com/FiZarxzT6s
— 2.0 (@Meme_Canteen) April 16, 2022
ఈ మ్యాచ్ లో శతకం బాదిన కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఒక్కసారిగా 21వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎకబాకాడు.
KL Rahul went from 21st position to 2nd position in Orange Cap race in 1 innings pic.twitter.com/U0ypBnhDyE
— Sagar (@sagarcasm) April 16, 2022
ఒక్క ఐపీఎల్ కూడా నెగ్గని జట్లలో ఆర్సీబీ ఒకటి. ఆ జట్టుకు కెప్టెన్‌గా చేసిన కోహ్లీ.. ఇంత దారుణంగా మేం (RCB) ఎప్పుడూ ఓడిపోలేదని రోహిత్‌ను చూసి నవ్వుతున్న మీమ్ వైరల్ అవుతోంది. గతంలో కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ టీమ్ వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడిపోయిందని తెలిసిందే.
Virat :- Itna to mai bhi nahi haara tha 🤣 pic.twitter.com/JAjye672UR
— ASmemesss (@asmemesss) April 16, 2022
జట్టులో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా నా పేరు ముందుకొస్తుందని సూర్యకుమార్ యాదవ్ ఏడుస్తున్నట్లు మీమ్ వదిలారు నెటిజన్స్. మిగతా టీమ్ మేట్స్ సూర్య పక్కన నిల్చుని ఉన్నారు.
#MIvLSG
— Sumit Mishra (@SumitLinkedIn) April 16, 2022
Suryakumar Yadav in every match : pic.twitter.com/yytP2or2Vc
SKY మీద ఆధారపడిన ఇద్దరు రోహిత్‌లు అని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ముంబై కెప్టెన్ రోహిత్‌ను ట్రోల్ చేస్తున్నారు.
2 Rohits who are dependent on SKY pic.twitter.com/XdwGTG0vVr
— Akash (@vaderakash) April 16, 2022
మా పైసలు మాకు తిరిగిచ్చెయ్ అని అంబానీలు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను అడుగుతున్నారు. భారీ ధరకు తీసుకున్న ఇషాన్ స్కోర్లు చేయడం లేదని ఇప్పుడు టీమ్ భావిస్తోంది.
Ambanis to Ishan kishan : pic.twitter.com/7K5UpG0vxO
— Cricket wala ladka (@cricketwalaldka) April 16, 2022
Mumbai Indians X Thor Ragnarok 🥹 pic.twitter.com/MdFtWBozGZ
— Manvansh🇮🇳 (@Vansh_Bhatia18) April 16, 2022
🤐🏃♀🏃♀ pic.twitter.com/aQ3t9aGBu1
— A (@AppeFizzz) April 16, 2022
రూ.15 కోట్ల ప్లేయర్ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్ అంట. 17 బంతుల్లో ఇషాన్ కిషన్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అందుకు సన్మానం చేస్తున్నారు.
Another day another Masterclass from 15cr+ young wicket keeper Ishan the Pocket Dynamo Kishan- 13(17)🔥😍
— TukTuk Academy (@TukTuk_Academy) April 16, 2022
NBDC Youngster of the season?🤔#MIvLSG pic.twitter.com/tSGzz2TVyD