LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
LSG vs RCB, Eliminator Highlights: ఐపీఎల్ 2022లో బెంగళూరు అద్భుతాలు చేస్తూనే ఉంది! ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. 208 టార్గెట్ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని కట్టడి చేసింది.
LSG vs RCB, Eliminator Highlights: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేస్తూనే ఉంది! ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. 208 పరుగుల భారీ టార్గెట్ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 14 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. ఛేదనలో కేఎల్ రాహల్ (79; 58 బంతుల్లో 3x4, 5x6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అతడికి తోడుగా దీపక్ హుడా (45; 26 బంతుల్లో 1x4, 4x6) దంచికొట్టాడు. అంతకు ముందు ఆర్సీబీలో రజత్ పాటిదార్ (111*; 53 బంతుల్లో 12x4, 7x6) ఈడెన్‌లో చెలరేగాడు. కెరీర్లో తొలి శతకం బాదేశాడు. అతడికి విరాట్ కోహ్లీ (25; 24 బంతుల్లో 2x4), దినేశ్ కార్తీక్ (37*; 23 బంతుల్లో 5x4, 1x6) అండగా నిలిచారు. హేజిల్‌వుడ్, హర్షల్‌పటేల్ డెత్ ఓవర్లను అద్భుతంగా విసిరారు.
రాహుల్ KLass కొట్టుడు
కళ్లెదుట భారీ టార్గెట్. వర్షం పడటంతో డ్యూ రాలేదు. ప్రత్యర్థి వద్ద చక్కని పేసర్లు, స్పిన్నర్లు ఉన్నారు. 8 పరుగుల వద్దే ఓపెనర్ డికాక్ (6) ఔటయ్యాడు. అయినా లక్నో పట్టు వదల్లేదు. రాహుల్, మనన్ వోహ్రా (19; 11 బంతుల్లో 1x4, 2x6) దంచికొట్టడంతో పవర్‌ప్లేలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా ఆచితూచి ఆడతూనే కేఎల్‌తో కలిసి చితక బాదాడు. రాహుల్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మూడో వికెట్‌కు 61 బంతుల్లో 96 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని హుడాను ఔట్ చేయడం ద్వారా హసరంగ విడదీశాడు. ఆ ఓవర్లో అప్పటికే హుడా రెండు సిక్సర్లు బాదేయడం స్పెషల్. ఆ తర్వాత స్టాయినిస్ (9)తో కలిసి రాహుల్ విధ్వంసం కొనసాగించాడు. సమీకరణం 18 బంతుల్లో 41 రన్స్‌గా మారింది. 18వ ఓవర్లో హర్షల్ 8 మాత్రమే ఇచ్చి టెన్షన్ పెంచాడు. ఆ తర్వాతి ఓవర్లో రాహుల్, కృనాల్ (0)ను హేజిల్‌వుడ్ ఔట్ చేసి మ్యాచును మలుపు తిప్పాడు. ఆఖరి 3 బంతుల్లో 16 పరుగులు అవసరం కాగా లక్నో కేవలం 2 పరుగులే చేసింది.
రప్ఫాడించిన రజత్
ఈడెన్‌లో చిరుజల్లులు కురవడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. 4 పరుగుల వద్దే కెప్టెన్ డుప్లెసిస్ (0)ను మొహిసిన్ ఖాన్ పెవిలియన్ పంపించాడు. అయినా బెంగళూరు ఒత్తిడి చెందలేదు. అందుకు కారణం రజత్ పాటిదారే. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచి బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పవర్‌ప్లేలో కృనాల్ పాండ్య బౌలింగ్‌ను ఉతికారేశాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. పవర్‌ప్లేలో 52/1తో ముగించిన ఆర్సీబీ 70 వద్ద కోహ్లీ, 86 వద్ద మాక్స్‌వెల్ (9), 115 వద్ద లోమ్రర్ (14) వికెట్లు చేజార్చుకుంది
కాసేపు లక్నో బౌలర్లు బెంగళూరు స్కోరును కంట్రోల్ చేశారు. ఈ సిచ్యువేషన్‌లో 28 బంతుల్లోనే రజత్ హాఫ్ సెంచరీ చేశాడు. బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 6,4,6,4,6 కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో డీకే నాలుగు బౌండరీలు దంచాడు. 18.4వ బంతిని సిక్సర్‌గా మలిచి రజత్ సెంచరీ చేశాడు. ఇందుకు 49 బంతులే తీసుకున్నాడు. ఆ తర్వాతా సిక్సర్లు, బౌండరీల వర్షం కురవడంతో బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డీకే, రజత్ కలిసి ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 92 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు.
COMING UP CLUTCH AND HOW! 🔥
— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022
Drop a ❤️ for this brilliant spell, 12th Man Army! 🙌🏻@HarshalPatel23 #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB #PlayOffs pic.twitter.com/ultWbDgPQI
Destination: Ahmedabad. ✈️ ✅ #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB #PlayOffs
— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022