(Source: ECI/ABP News/ABP Majha)
LSG vs MI Preview: అర్జున్ తెందూల్కర్‌కు టైమొచ్చిందా? లక్నో మ్యాచులోనైనా ముంబయి గెలుస్తుందా?
LSG vs MI Preview: ఐపీఎల్ 2022లో 37వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరిది పైచేయి?
IPL 2022 lsg vs mi preview lucknow supergiants vs mumbai indians head to head records playing xi: ఐపీఎల్ 2022లో 37వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. వాంఖడే (Wankhede Stadium) ఇందుకు వేదిక. ఆడిన 7లో 4 గెలిచిన కేఎల్ రాహుల్ (KL Rahul) సేన ప్లేఆఫ్స్ చేరేందుకు గట్టిపోటీ ఇస్తోంది. మరోవైపు హిట్‌మ్యాన్ సేన 7లో 7 ఓడి అభిమానులకు షాకుల మీద షాకులిస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరిది పైచేయి? తుది జట్టులో ఎవరుంటారు? ఎవరితో ఎవరికి ముప్పుంది?
లక్నో ఆ ఒక్కటీ!
ఈ సీజన్లో ఇప్పటికే ఒకసారి ముంబయి, లక్నో (MI v LSG) తలపడ్డాయి. కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచులోనూ అదే రిపీటైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ముంబయిపై కేఎల్ సగటు ఏకంగా 90కి పైగా ఉంది. ఆ జట్టులోని కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగునూ ఆడేసుకుంటాడు. బ్యాటింగ్ పరంగా లక్నోకు ఎక్కువగా ఇబ్బందులేమీ లేవు. మూడో స్థానంలో మనీశ్ పాండే విఫలమవ్వడం ఒక్కటే వీక్‌నెస్. బహుశా ఆ స్థానంలో జేసన్ హోల్డర్ లేదా స్టాయినిస్‌కు ఛాన్స్ రావొచ్చు. ఇక బౌలింగ్ అద్భుతంగా ఉన్నా పరుగుల్ని లీక్ చేస్తున్నారు. త్వరగా లెంగ్తులను పట్టుకోవడం లేదు. ఇదొక్కటి సరి చేసుకుంటే ప్రత్యర్థిని తక్కువకే పరిమితం చేయొచ్చు.
ముంబయి.. ఇక ప్రయోగాలే!
పాపం! ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. ఎలాగూ వరుగా ఏడు మ్యాచులు ఓడిపోవడంతో ప్లేఆఫ్ అవకాశాలు పోయినట్టే. కోల్పోయేందుకు ఏమీ లేదు కాబట్టి ఇకపై రకరకాల ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించేందుకు సిద్ధమవుతారు. హృతిక్ షోకీన్‌ను అలా సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు రాణించిన మయాంక్ మర్కండేకు చోటివ్వొచ్చు. గతేడాది నుంచి సచిన్ కొడుకు అర్జున్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. దీంట్లో లేదా తర్వాతి మ్యాచులో అతడికి ఛాన్స్ దక్కొచ్చు. రోహిత్, ఇషాన్, పొలార్డ్ ఫామ్ అందుకుంటే మరికొంత బాగుంటుంది. బౌలింగ్‌లో బుమ్రాకు ఇప్పుడు డేనియెల్ సామ్స్ తోడు దొరికింది. కన్‌సిస్టెంట్‌గా వికెట్లు పడగొట్టడం అవసరం.
LSG vs MI probable XI
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, డీవాల్డ్ బ్రూవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్/టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్ /మయాంక్ మర్కండే, జయదేవ్ ఉనద్కత్, డేనియెల్ సామ్స్, రిలే మెరిడీత్, జస్ప్రీత్ బుమ్రా
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనీశ్ పాండే / కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టాయినిస్, జేసన్ హోల్డర్, దుష్మంత చమీరా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
Oh, how much we 𝐌𝐈𝐬𝐬𝐞𝐝 our home! 🏟️💙#OneFamily #DilKholKe #MumbaiIndians #LSGvMI MI TV pic.twitter.com/RW1BZq44Dg
— Mumbai Indians (@mipaltan) April 24, 2022
Sunday. #LSGvMI. Wankhede. ☀️
— Mumbai Indians (@mipaltan) April 24, 2022
Chalo fir ye perfect din ki shuruaat karte hai 𝐌𝐈 𝐃𝐚𝐢𝐥𝐲 ke saath! 💙#OneFamily #DilKholKe #MumbaiIndians pic.twitter.com/Z19v0ZoGhP