Jasprit Bumrah: కోల్‌కతాపై నిప్పులు చిమ్మిన బుమ్రా - ఐదు వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు - ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
![Jasprit Bumrah: కోల్‌కతాపై నిప్పులు చిమ్మిన బుమ్రా - ఐదు వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు - ముంబై టార్గెట్ ఎంతంటే? IPL 2022: Kolkata Knight Riders Scored 165 For Nine Wickets Against Mumbai Indians in Match 56 Jasprit Bumrah: కోల్‌కతాపై నిప్పులు చిమ్మిన బుమ్రా - ఐదు వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు - ముంబై టార్గెట్ ఎంతంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/09/c3711e5026732a86f709601a23de4431_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తడబడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీసుకోవడం విశేషం. ముంబై ఇండియన్స్ విజయానికి 120 బంతుల్లో 166 పరుగులు కావాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కళ్లు చెదిరే ఆరంభం లభింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (43: 24 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడాడు. తనకు అజింక్య రహానే (25: 24 బంతుల్లో, మూడు ఫోర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. అయితే వెంకటేష్ అయ్యర్‌ను అవుట్ చేసి కుమార్ కార్తికేయ కోల్‌కతాకు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే అజింక్య రహానే కూడా కార్తికేయ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డయ్యాడు.
అక్కడ్నుంచి కోల్‌కతాకు కష్టాలు మొదలయ్యాయి. రెండో స్పెల్‌లో జస్‌ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో వేగంగా ఆడుతున్న నితీష్ రాణా (43: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌లను (9: 5 బంతుల్లో, ఒక సిక్సర్) అవుట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో కూడా షెల్డన్ జాక్సన్ (5: 7 బంతుల్లో), ప్యాట్ కమిన్స్ (0: 2 బంతుల్లో), సునీల్ నరైన్‌లను (0: 1 బంతి) అవుట్ చేయడంతో బుమ్రా ఐదు వికెట్ల మార్కును కూడా అందుకున్నాడు.
చివర్లో రింకూ సింగ్ (23 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త పోరాడినా తనకు మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఒక దశలో 200 స్కోరును సులభంగా అందుకుంటుంది అనుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితం అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఇది ఐదో స్థానంలో నిలిచింది. కుమార్ కార్తికేయకు రెండు వికెట్లు దక్కగా... డేనియల్ శామ్స్, మురుగన్ అశ్విన్‌లు చెరో వికెట్ తీశారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)