IPL 2022, KL Rahul: ముంబయి ఇండియన్స్‌పై కేఎల్‌ రాహుల్‌ లవ్‌ అఫైర్‌!! ఏంటీ కహానీ!!

KL Rahul vs Mumbai Indians: కొందరికి కొన్ని జట్లంటే మస్తు ఇష్టం! ప్రతిసారీ వారిపై బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తుంటారు. ముంబయి ఇండియన్స్‌పై కేఎల్‌ రాహుల్‌ లవ్‌ ఎఫైర్‌ అలాంటిదే!

FOLLOW US: 

IPL 2022 kl rahul un ending love affair with mumbai indians : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కొంతమంది ఆటగాళ్లకు కొన్ని జట్లంటే మస్తు ఇష్టం! ప్రతిసారీ వారిపై బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తుంటారు. ముంబయి ఇండియన్స్‌పై కేఎల్‌ రాహుల్‌ లవ్‌ ఎఫైర్‌ అలాంటిదే! ఎందుకో ఏమో తెలీదు గానీ హిట్‌మ్యాన్‌ సేనతో మ్యాచంటే చాలు రెచ్చిపోతాడు. పిచ్చిపిచ్చిగా పరుగులు చేస్తాడు.

ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్‌పై కేఎల్‌ రాహుల్‌ 15 మ్యాచులు ఆడాడు. 76.40 సగటు, 132 స్ట్రైక్‌రేట్‌తో 764 పరుగులు చేశాడు. ఐదుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఐదు అర్ధశతకాలు చేశాడు. రెండు సెంచరీలు ఉతికారేశాడు. అతడికి మరే జట్టుపైనా ఇన్ని పరుగులు లేవు. ఇంత సగటు, స్ట్రైక్‌రేట్‌ లేవు. ఇందుకో కారణం ఉంది.

ముంబయి ఇండియన్స్‌ ఎక్కువగా వాంఖడేలోనే మ్యాచులు ఆడుతుంది. ఆ పిచ్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మంచి బౌన్స్‌ లభిస్తుంది. బ్యాటుమీదకు బంతి సులభంగా వస్తుంది. ప్రత్యేకంగా రాహుల్‌కు బౌన్సీ పిచ్‌లంటే ఇష్టం. ఇక ముంబయిలోని బౌలర్లు సైతం అదనపు పేస్‌, బౌన్స్‌ జనరేట్‌ చేస్తారు. దానిని అనుకూలంగా మలుచుకొని అతడు బౌండరీలు, సిక్సర్లు బాదేస్తుంటాడు.

2018 నుంచి ముంబయి ఇండియన్స్‌పై రాహుల్‌ బ్యాటింగ్‌ భీకరంగా ఉంటోంది. ఏకంగా 94.5 సగటుతో రన్స్‌ చేస్తున్నాడు. మూడుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. మూడుసార్లూ 90+ రన్స్‌ కొట్టాడు. 2018 నుంచి వరుసగా 24, 94, 71, 100 నాటౌట్‌, 17, 77, 60 నాటౌట్‌, 21, 103 నాటౌట్‌తో అలరించాడు.

ఐపీఎల్‌ 2022లో ముంబయి ఇండియన్స్‌తో ఆడిన మొదటి మ్యాచులో రాహుల్‌ బీభత్సం సృష్టించాడు. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్నాడు. జట్టుకు తిరుగులేని విజయం అందించాడు. అత్యల్ప ఎకానమీతో పరుగులిచ్చే జస్ప్రీత్‌ బుమ్రా సైతం అతడిని ఆపలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 99 బంతులేసి 124 పరుగులు ఇచ్చాడు. కేవలం రెండుసార్లే ఔట్‌ చేశాడు. ఇక అతడిపై కేఎల్‌ సగటు 62, స్ట్రైక్‌రేట్‌ 125 కావడం ప్రత్యేకం.

View this post on Instagram
 
A post shared by Lucknow Super Giants (@lucknowsupergiants)

Published at : 24 Apr 2022 06:23 PM (IST) Tags: IPL KL Rahul Mumbai Indians Jasprit Bumrah IPL 2022 IPL 2022 news kl rahul love affair

సంబంధిత కథనాలు

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్