GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్ - రాజస్థాన్ తొలి బ్యాటింగ్
GT vs RR, Qualifier 1: ఐపీఎల్ 2022లో తొలి క్వాలిఫయర్ టాస్ పడింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు.
GT vs RR, Qualifier 1: ఐపీఎల్ 2022లో తొలి క్వాలిఫయర్ టాస్ పడింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఈడెన్‌లో మ్యాచులు జరగలేదు కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నామన్నాడు. లాకీ ఫెర్గూసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్ ను తీసుకున్నామని పేర్కొన్నాడు.
సంజూ శాంసన్ ఈ సీజన్లో 14 సార్లు టాస్‌కు వస్తే 12 సార్లు ఓడిపోయాడు. పాపం! ఈ సారీ అలాగే జరిగింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని సంజు చెప్పాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రన్ హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయి్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమి
గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ఈ సీజన్‌లో ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్, రాజస్తాన్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (87: 52 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది. జోస్ బట్లర్ (54: 24 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు.
ఈ రెండు జట్ల మధ్య గుజరాత్ కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. డేవిడ్ మిల్లర్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్‌లు బౌలింగ్‌లో కీలకం కానున్నారు.
🚨 Toss Update 🚨@hardikpandya7 has won the toss & @gujarat_titans have elected to bowl against @rajasthanroyals.
— IndianPremierLeague (@IPL) May 24, 2022
Follow the match ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/vU3rmlVXRP
🚨 Team News 🚨
— IndianPremierLeague (@IPL) May 24, 2022
1⃣ change for @gujarat_titans as Alzarri Joseph is named in the team. @rajasthanroyals remain unchanged.
Follow the match ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR
A look at the Playing XIs 🔽 pic.twitter.com/9w9kJLw0Cr