By: ABP Desam | Updated at : 09 Apr 2022 01:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సన్‌రైజర్స్‌పై ఫేవరెట్స్‌గా చెన్నై! 12-6 తేడాతో ధోనీ/జడ్డూ సేన డామినేషన్ (image credit: csk twitter)
IPL 2022, chennai superkings vs sunrisers hyderabad head to head records : ఐపీఎల్ 2022లో 17వ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడుతున్నాయి. డీవై పాటిల్ స్టేడియం (DY Patil Stadium) ఇందుకు వేదిక. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు విజయం సాధించలేదు. నేటి మ్యాచుతో ఎవరో ఒకరు గెలుపు బోణీ కొడతారు. మరి ఈ రెండింట్లో ఎవరిపై ఎవరిది ఆధిపత్యం? తుది జట్లు ఏంటి? గెలిచేదెవరు?
ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంప్ సీఎస్‌కే (CSK) భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా (Ravindra Jadeaj)ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో భవిష్యత్తు ప్రణాళికలు మొదలయ్యాయి. ఇక ఎంఎస్ ధోనీ (MS Dhoni) వికెట్ల వెనకాల ఉండి మ్యాచును పర్యవేక్షిస్తుండటంతో విజయాలు సాధిస్తారనే అభిమానులు అంచనా వేశారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ సీఎస్‌కేకు ఓటములే ఎదురయ్యాయి. దీపక్ చాహర్ (Deepak chahar) లేకపోవడంతో వారికో పెద్ద ఇబ్బందిగా మారిపోయింది.
ఐపీఎల్ 2016 ఛాంపియన్ సన్‌రైజర్స్ (SRH) పరిస్థితీ ఇలాగే ఉంది. ఆడిన రెండింట్లోనూ ఓడిపోయి అభిమానులను నిరాశపరిచారు. మొత్తంగా జట్టే బాగాలేకపోవడం ఫ్యాన్స్‌ను వేధిస్తోంది. భారీ అంచనాలున్న ఒక్క క్రికెటరూ జట్టులో లేడు. సమతూకం లేకపోవడం, కూర్పు బాగాలేకపోవడం ఓటములకు కారణం. కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఓపెనింగ్‌కు రావడంతో మిడిలార్డర్లో జట్టును ఆదుకొనే వారు కరవయ్యారు.
Koo App#ChennaiSuperKings skipper #RavindraJadeja has revealed that his team will desperately be looking for that elusive win later on Saturday against #SunRisersHyderabad at the DY Patil Stadium, which will give them the ”momentum” to return to winning ways in the new season. Photo: IPL/Twitter - IANS (@IANS) 9 Apr 2022
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH) ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో తలపడ్డాయి. 12-4తో సీఎస్‌కేదే ఆధిపత్యం. సన్‌రైజర్స్ కేవలం నాలుగు మ్యాచులే గెలిచింది. చివరి సారి తలపడ్డ ఐదింట్లోనూ విజిల్ పొడు బ్యాచుకు తిరుగులేదు. వారు 4 గెలిస్తే హైదరాబాద్ ఒక్కటే గెలిచింది. అంటే శనివారం జరిగే మ్యాచులో చెన్నై ఫేవరెట్ అనడంలో సందేహం లేదు.
CSK vs SRH Probable XI
చెన్నై సూపర్ కింగ్స్ (CSK playing xi): రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్, తుషార్ దేశ్ పాండే
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH playing xi): రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ గోపాల్, టి.నటరాజన్
Can CSK register their first win of #TataIPL 2022 today against Sunrisers ?
— S.Badrinath (@s_badrinath) April 9, 2022
Watch my preview of #CSKvSRH here 🔗 https://t.co/SDOVnf4Ojm#CricItWithBadri #DafaNewsIndia #CSK #SRH pic.twitter.com/aEH4xiYwxf
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!
RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్ మియా! హైదరాబాదీ పేస్ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు
IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్ అంటూ పొగడ్త
IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం