అన్వేషించండి

Deepak Chahar Ruled Out: CSKకు షాక్‌! ఐపీఎల్‌ మొత్తానికీ దీపక్‌ చాహర్‌ ఔట్‌.. కేకేఆర్‌లోనూ!

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఈ సీజన్‌ మొత్తానికీ దూరమయ్యాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings)కు షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్‌ దీపక్‌ చాహర్‌ (Deepak Chahar) ఈ సీజన్‌ మొత్తానికీ దూరమయ్యాడు. వెన్నెముకకు గాయం కావడమే ఇందుకు కారణం. కోల్‌కతా యువ పేసర్‌ రసిక్‌ సలామ్‌ వెన్నెముక దిగువ భాగంలో గాయం కావడంతో అతడూ లీగుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షిత్‌ రాణాను కేకేఆర్‌ తీసుకుంది. దిల్లీకి చెందిన ఈ కుర్రాడిని  రూ.20 లక్షల కనీస ధరతో తీసుకుంది.

సీఎస్‌కేలో దీపక్‌ చాహర్‌ ఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. లేదా అస్సలు ఆడకనే పోవచ్చని కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి! బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహబిలిటేషన్‌కు వెళ్లిన అతడికి మరో గాయమైంది. రిహబిలిటేషన్‌లో అతడి వెన్నెముకకు గాయమైంది. నెల రోజుల నుంచి దీపక్‌ చాహర్‌ ఎన్‌సీఏలోనే ఉంటున్నాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో టీ20 సిరీసు ఆడటేప్పుడు అతడి క్వాడ్రాసిప్స్‌లో చీలిక వచ్చింది. ఆ గాయం నుంచి కోలుకొనేందుకు దీపక్‌ ఎన్‌సీఏకు వెళ్లాడు. అతడి గాయం తీవ్రతను బట్టి ఎన్‌సీఏ ఫిజియోలు ఐపీఎల్‌ తొలి అర్ధభాగం వరకు చాహర్‌ అందుబాటులో ఉండకపోవచ్చని అంచనా వేశారు.

వేగంగా కోలుకుంటున్న దీపక్‌ చాహర్‌కు ఇప్పుడు మరో గాయం కావడం సీఎస్‌కే గెలుపు అవకాశాలను మరింత దెబ్బతీయనుంది. అతడు పూర్తిగా కోలుకోందే బయటకు పంపించకూడదని ఎన్‌సీఏ నిర్ణయించుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు అతడిని ఫిట్‌గా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది.

దీపక్‌ చాహర్‌ బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొడతాడు. అంతేకాకుండా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగుకు వచ్చి కీలక పరుగుల్ని చేస్తాడు. ఈ సీజన్లో అతడు లేకపోవడంతో చెన్నైకి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో పవర్‌ప్లేలో 24 ఓవర్లు వేసిన సీఎస్‌కే బౌలర్లు 8.62 ఎకానమీతో కేవలం 2 వికెట్లు తీశారు. డెత్‌లోనూ వారి బౌలింగ్‌ చెత్తగా ఉంటోంది.

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 59 ఇన్నింగ్సుల్లో పవర్‌ప్లే ఓవర్లలో దీపక్‌ చాహర్‌ 7.61 ఎకానమీతో 42 వికెట్లు తీయడం గమనార్హం. ఐపీఎల్‌లో చాహర్‌ కోసం సీఎస్‌కే రూ.14 కోట్లు చెల్లించింది. కానీ అతడు లేకపోవడంతో ఆ స్థాయి దేశవాళీ బౌలర్‌ ఎవరూ సీఎస్‌కేకు దొరకడం లేదు. విదేశీ పేసర్లను ఉపయోగించుకోవడానికి కుదరడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget