By: ABP Desam | Updated at : 08 Mar 2022 06:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఏబీ డివిలియర్స్ Photo: PTI
AB de Villiers RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్‌న్యూస్! 'మిస్టర్ 360' డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మళ్లీ ఆ జట్టులో చేరనున్నాడు. అయితే ఈసారి క్రికెటర్‌గా కాదండోయ్! ఆ జట్టు మెంటార్‌గా వస్తున్నాడని సమాచారం. ఇంటర్నెట్లో ఇప్పటికే ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగులో (Indian Premier Leauge) మోస్ట్ ఎంటర్‌టైనింగ్ క్రికెటర్లలో ఏబీ డివిలియర్స్ (AB de Villers) ఒకడు. అతడు క్రీజులోకి వస్తుంటేనే ఫ్యాన్స్ పరవశించి పోతారు. క్రీజులో నిలబడి కొడతాడో, కూర్చొని కొడతాడో, పక్కకు తిరిగి దంచుతాడో, అప్పర్ కట్స్‌తో అలరిస్తాడో, ఆఫ్‌సైడ్ దూరంగా జరిగి మోకాళ్లపై కూర్చొని లెగ్‌సైడ్ కొడతాడోనని ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. అందుకే అతడికి ఇండియాలో ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ.
ఆర్‌సీబీ (RCB) పేరు వింటేనే మొదట అందరికీ గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ (Virat Kohli), ఏబీ డివిలియర్స్ జోడీ! వీరిద్దరూ క్రీజులో నిలబడి కొట్టిన షాట్లను ఎవ్వరూ మర్చిపోలేరు. ఒకరితో మరొకరు పోటీపడి పరుగులు చేస్తారు. సెంచరీలు బాదేస్తారు. అయితే గత సీజన్ తర్వాత ఐపీఎల్‌కు (IPL) దూరమవుతున్నానని ఏబీడీ ప్రకటించాడు. అంతకు ముందే అతడు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
బెంగళూరుతో ఏబీడీకి విడదీయరాని అనుబంధం ఉంది. పైగా డ్యాషింగ్ అండ్ డేరింగ్ క్రికెటర్‌గా పేరుంది. క్రికెట్‌పై మంచి నాలెడ్జ్ ఉంది. అందుకే అతడి సేవలను ఉపయోగించుకోవాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ అనుకుంటోందని తెలిసింది. ఇప్పటికే అతడిని సంప్రదించి మెంటార్ పోస్టుకు ఒప్పించిందని సమాచారం.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆర్‌సీబీ మరొకరిని నాయకుడిగా ప్రకటించలేదు. ఆ జట్టు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలానే ఉన్నాయి. అందుకే మార్చి 12న తమ కెప్టెన్ ఎవరో బెంగళూరు ప్రకటించనుందని సమాచారం. ఇదే సమయంలో ఏబీ డివిలియర్స్ కొత్త పాత్ర గురించీ చెబుతారని అంటున్నారు. అతడు మళ్లీ కనిపిస్తే మాత్రం అభిమానులు ఫుల్లు హ్యాపీ!
ఐపీఎల్‌లో ఏబీడీ 184 మ్యాచులు ఆడాడు. 39.71 సగటు, 151 స్ట్రైక్‌రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ౩ సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు సాధించాడు. 413 బౌండరీలు, 250 సిక్సర్లు కొట్టాడు.
𝗥𝗖𝗕 𝗨𝗡𝗕𝗢𝗫
— Royal Challengers Bangalore (@RCBTweets) March 7, 2022
1️⃣2️⃣th March 2️⃣0️⃣2️⃣2️⃣ #ForOur12thMan
Watch this space for more. 😎#PlayBold #UnboxTheBold #WeAreChallengers pic.twitter.com/nXjycELqgc
The beginning of a new era of leadership requires a BIG stage. 😎
— Royal Challengers Bangalore (@RCBTweets) March 8, 2022
Who is the captain of RCB for #IPL2022? Come find out on 12th March at the #RCBUnbox event on Museum Cross Road, Church Street. 🤩💪🏻#PlayBold #UnboxTheBold #ForOur12thMan pic.twitter.com/HdbA98AdXB
Spotted in Bengaluru.👀
— Royal Challengers Bangalore (@RCBTweets) March 8, 2022
We’re doing something extremely special for our fans. #RCBUnbox - an immersive, nostalgic & futuristic RCB experience, just for you!🤩😎
Date: 12/3/2022
📍Museum Cross Road, Church Street
Watch this space for more details. #PlayBold #UnboxTheBold pic.twitter.com/4MpaSUMpHJ
IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది
IPL 2024 : ముంబై గూటికి హార్దిక్ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?
IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్
IPL 2024: ఐపీఎల్ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు
Hardik Pandya: ముంబై గూటికి హార్దిక్ పాండ్యా! , ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ జరుగుతుందా?
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
/body>