Chennai Super Kings: ఐపీఎల్ చరిత్రలో చెన్నై హయ్యస్ట్ స్కోర్లు ఇవే - కోల్‌కతాపై కొట్టిన స్కోరు ఏ స్థానంలో ఉంది?
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక టోటల్స్ ఇవే!
Highest Innings Totals For CSK: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన మూడో అత్యధిక స్కోరు ఇది. అదే సమయంలో ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ అతిపెద్ద స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులుగా ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ ఐపీఎల్ 2010 సీజన్‌లో జరిగింది.
IPL చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో అత్యధిక స్కోరు 5 వికెట్లకు 240 పరుగులుగా ఉంది. ఐపీఎల్ మొదటి ఎడిషన్ అయిన 2008 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది.
అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ IPL 2023లో మూడవ అత్యధిక స్కోరు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై ఈ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో అత్యధిక స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులుగా ఉంది. ఐపీఎల్ 2023 సీజన్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్కోరు చేసింది.
ఇక కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే... టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే చెన్నైకి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మొదటి బంతి నుంచే బౌండరీలతో చెలరేగారు. వీరి బ్యాటింగ్‌తో చెన్నై పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు సాధించింది. అయితే సుయాష్ శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వీరు మొదటి వికెట్‌కు 73 పరుగులు జోడించారు.
రెండో వికెట్‌కు రహానేతో కలిసి 36 పరుగులు జోడించిన అనంతరం డెవాన్ కాన్వే కూడా అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి చెన్నై బ్యాటింగ్ టాప్ గేర్‌కు వెళ్లిపోయింది. అజింక్య రహానే, శివం దూబే ఇద్దరూ శివాలెత్తిపోయినట్లు ఆడారు. వీరు మూడో వికెట్‌కు కేవలం 32 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. ఆ తర్వాత శివం దూబే అవుటైనా రవీంద్ర జడేజా కూడా సిక్సర్లతో చెలరేగాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో కుల్వంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.
Starry Nights at Eden tonight!
— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2023
🦁2️⃣3️⃣5️⃣
Up Next: Swingams in Action!#KKRvCSK #WhistlePodu #Yellove. 💛
🆙 🔝 🙌#KKRvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/hVfQCepsfH
— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2023